కెప్టెన్ గా ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ

By telugu teamFirst Published Sep 3, 2019, 10:17 AM IST
Highlights

కరేబియన్ దీవుల్లో తొలిసారి టెస్ట్ సిరీస్ కు క్లీన్ స్వీప్ చేసిన ఘనత దక్కింది. అదేవిధంగా ఐసీసీ వరల్డ్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలోో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఈ విజయం ద్వారా వ్యక్తిగతంగా కోహ్లీ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మొత్తం 48టెస్టులకు సారథ్యం వహించిన కోహ్లీ.. 28 విజయాలతో ధోని రికార్డును బ్రేక్ చేశాడు.

రికార్డుల రారాజు, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన అన్ని సిరీస్ మ్యాచుల్లోనూ టీం ఇండియానే విజయం సాధించింది. వెస్టిండీస్ ని దారుణంగా ఓడిచింది. ఈ క్రమంలో పలు రికార్డులను సృష్టించింది. 257 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించిన కోహ్లీ సేన 2-0 తో సిరీస్ ని కైవసం చేసుకుంది.

తద్వారా కరేబియన్ దీవుల్లో తొలిసారి టెస్ట్ సిరీస్ కు క్లీన్ స్వీప్ చేసిన ఘనత దక్కింది. అదేవిధంగా ఐసీసీ వరల్డ్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలోో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఈ విజయం ద్వారా వ్యక్తిగతంగా కోహ్లీ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మొత్తం 48టెస్టులకు సారథ్యం వహించిన కోహ్లీ.. 28 విజయాలతో ధోని రికార్డును బ్రేక్ చేశాడు.

తద్వారా టీం ఇండియా  మాజీ కెప్టెన్ల అందరికంటే ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్ గా నిలిచాడు. అంతకముందు ఈ రికార్డు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉండేది. కెప్టెన్ గా 27 మ్యాచ్ లు గెలిపించిన ధోనీ విజయాల శాతం 45గా ఉండగా... కోహ్లీ 55.31 శాతం విజయాలతో అతడి రికార్డును బ్రేక్ చేశాడు. కాగా ప్రస్తుతం ఓవరాల్‌గా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్ల జాబితాలో స్టీవ్‌ వా(36), రికీ పాంటింగ్‌(33) తర్వాత కోహ్లి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

2014లో ధోనీ నుంచి టెస్టు పగ్గాలు కోహ్లీ అందుకున్నాడు. అప్పటి నుంచి జట్టును గెలిపించడానికి కోహ్లీ కృషి చేస్తూనే ఉన్నాడు.ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లపై స్వదేశంలో గెలుపొందడంతో పాటుగా...ఆస్ట్రేలియాలో 2019లో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గి 71 ఏళ్లుగా భారత్‌కు అందని ద్రాక్షగా ఉన్న కలను సాకారం చేశాడు. అంతేకాకుండా విదేశాల్లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా సౌరవ్‌ గంగూలీ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించాడు.

click me!