ఆసియా కఫ్ ఎఫెక్ట్ : విరాట్ కోహ్లీ అఫిషియల్ వెబ్ సైట్‌ హ్యాక్

By Arun Kumar PFirst Published Oct 3, 2018, 5:25 PM IST
Highlights

ఆసియాకప్ టోర్నీ ఫైనల్లో భారత్ చేతిలో తమ జట్టు ఓడిపోడాన్ని బంగ్లాదేశ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిపోయిన లిటన్ దాస్ ను థర్డ్ అంఫైర్ స్టంపౌట్ గా ప్రకటిచడాన్ని వారు తప్పుబడుతున్నారు. అంపైర్ల తప్పుడు నిర్ణయం వల్లే బంగ్లాదేశ్ ఆసియా కప్ ఫైనల్లో ఓటమిపాలయ్యిందని బంగ్లా అభిమానులు సోషల్ మీడియా వేదికన ఆరోపిస్తున్నారు. అంతేకాదు తప్పుడు నిర్ణయం వల్ల నష్టపోయిన బంగ్లాకు ఐసిసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే కేవలం సోషల్ మీడియా పోస్టులతోనే అభిమానులు ఆగిపోలేదు. ఏకంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అధికారిక వెబ్ సైట్ ను కూడా హ్యాక్ చేశారు. అందులో లిట్టరు దాస్ స్టంపౌటయిన ఫోటోను పెట్టారు. దీన్ని ఎలా ఔట్ గా ప్రకటిస్తారని ఐసిసి ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన థర్డ్ అంపైర్ పై చర్యలు తీసుకుని క్షమాపణ చెప్పాలని వారు ఐసీసీ ని కోరారు. లేకుంటే ఐసీసీ అధికారిక వెబ్ సైట్ ను కూడా హ్యాక్ చేస్తామని హెచ్చరించారు.

ఇది భారతీయులను అవమానించడం కోసం చేయలేదని హ్యాకర్లు వివరణ ఇచ్చారు. తమ జట్టుకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మాత్రమే ఇలా నిరసన తెలిపినట్లు ప్రకటించారు.  ప్రతి దేశాన్ని సమానంగా చూడాల్సిన బాధ్యత ఐసిసి పై ఉందని హ్యాకర్లు పేర్కొన్నారు.థర్డ్‌ అంపైర్‌ సిబంధనలు మరిచిపోయి తమ ఓపెనర్ లిట్టర్ దాస్ ను ఔట్ గా ప్రకటించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

click me!