అడిలైడ్ టెస్ట్... షాన్ మార్ష్ సెంచరీ సెంటిమెంట్

By ramya neerukondaFirst Published Jan 16, 2019, 10:42 AM IST
Highlights

భారత్‌తో అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో ఆసీస్ ఆటగాడు షాన్ మార్ష్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. అతడి దెబ్బకు ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

భారత్‌తో అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో ఆసీస్ ఆటగాడు షాన్ మార్ష్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. అతడి దెబ్బకు ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మొత్తం 123 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 11 ఫోర్లు, 3 సిక్సర్లతో కెరీర్‌లో ఆరో సెంచరీ (131) నమోదు చేశాడు. మార్ష్ బాదుడుతో ఆస్ట్రేలియా 298 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

ఇంత భారీ స్కోరు చేసినా జట్టు మాత్రం పరాజయం పాలైంది. విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో భారత్ అలవోకగా విజయం సాధించింది. మరో 4 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి గెలుపొందింది.అయితే, ఈ మ్యాచ్‌లో విశేషం ఏమిటంటే మార్ష్ సెంచరీ చేసినా ఆ జట్టు ఓడిపోవడం. 

అయితే..ఆసీస్‌కు ఇది కొత్తమే కాదు. ఎందుకంటే.. షాన్ మార్ష్ మొత్తం ఆరు సెంచరీలు చేయగా అందులో నాలుగింటిలో ఆస్ట్రేలియా ఓడింది. కార్డిఫ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్ష్ 131 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డుర్హమ్‌లో ఇంగ్లండ్‌తోనే జరిగిన మ్యాచ్‌లో మార్ష్ 101 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 

హోబర్ట్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో మార్ష్ 106 పరుగులు చేశాడు. ఇందులో ఆసీస్ 40 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తాజాగా అడిలైడ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడింది. ఇలా మార్ష్ సెంచరీ చేసిన మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి పాలవుతూ వస్తోంది.

 

మరిన్ని వార్తలు ఇక్కడ చదవండి

ఈ విజయం నాది కాదు...ఆయనదే: కోహ్లీ

జడేజా షార్ప్ త్రో చూశారా: ఖవాజాకు షాక్

ఆసీస్ పై భారత్ విజయం: ధోనీయే ఫినిషర్, సిరీస్ సమం

click me!