చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్స్ సత్తా చాటుతున్నారు. తాజాగా పురుషుల హైజంప్ టీ47లో భారతదేశానికి చెందిన నిషాద్ కుమార్ స్వర్ణం సాధించారు.
చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్స్ సత్తా చాటుతున్నారు. తాజాగా పురుషుల హైజంప్ టీ47లో భారతదేశానికి చెందిన నిషాద్ కుమార్ పారా ఆసియా గేమ్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పి స్వర్ణం సాధించారు. నిషాద్ తన ఇతర పోటీదారులతో పోలిస్తే మంచి ప్రదర్శనను నమోదు చేశారు. 2.02 మీటర్ల ఎత్తుతో దూకి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన హాంగ్‌జీ చెన్ 1.94 మీటర్ల ఎత్తు దూకి రజతంతో సరిపెట్టుకున్నారు. ఇక, మరో భారత ఆటగాడు రామ్ పాల్ కూడా తన ఐదో ప్రయత్నంలో 1.94 మీటర్ల నమోదు చేసి రజతం సాధించారు.
మరోవైపు పురుషుల షాట్‌పుట్ ఎఫ్-11 ఫైనల్‌లో భారత పారా అథ్లెట్ మోను ఘంగాస్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. మోను తన 4వ ప్రయత్నంలో వచ్చిన 12.33 మీటర్ల త్రో ద్వారా సీజన్-బెస్ట్ త్రోతో ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మహిళల కానో వీఎల్2 ఈవెంట్‌లో ప్రాచీ యాదవ్ 1:03.147తో రజతం సాధించారు.
undefined
ఇదిలాఉంటే, పారా ఆసియా క్రీడల్లో పురుషుల హైజంప్ టీ63, పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లలో భారతదేశం మొత్తం అన్ని పతకాలను కైవసం చేసుకుని.. ఘనమైన ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల హైజంప్ టీ63 ఈవెంట్‌లో శైలేష్ కుమార్, బ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో ప్రణవ్ సూర్మ గోల్డ్ మెడల్స్ సాధించారు.
పురుషుల హైజంప్ టీ63 విభాగంలో శైలేష్ కుమార్ 1.82 మీటర్లతో స్వర్ణం సాధించి.. పారా ఆసియా గేమ్స్‌లో రికార్డును నెలకొల్పారు. ఇదే గేమ్‌లో భారత్‌కే చెందిన మరియప్పన్ తంగవేలు (1.80 మీ).. రజతం, గోవింద్‌భాయ్ రాంసింగ్‌భాయ్ పధియార్ (1.78 మీ).. కాంస్యం సాధించారు. అయితే ఈ ఈవెంట్‌లో ముగ్గురు భారతీయులు మాత్రమే పోటీ పడ్డారు.
పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో.. పారా ఆసియా పారా గేమ్స్‌లో 30.01 మీటర్ల రికార్డును సృష్టించి ప్రణవ్ సూర్య స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. భారత్‌కు చెందిన ధరంబీర్ (28.76 మీ), అమిత్ కుమార్ (26.93 మీ) వరుసగా రెండు మరియు మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక, ఈ ఈవెంట్‌లో కేవలం నలుగురు పోటీదారులు మాత్రమే ఉన్నారు. ఇక, సౌదీ అరేబియాకు చెందిన రాధి అలీ అల్హర్తి 23.77 మీటర్ల త్రోతో చివరి స్థానంలో నిలిచారు.