అఫ్గాన్ చేతిలో చావు దెబ్బ తిన్న శ్రీలంక: టోర్నీ నుంచి ఔట్

By pratap reddyFirst Published Sep 17, 2018, 10:02 PM IST
Highlights

ఆసియా కప్ లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచులో పసికూన అఫ్గనిస్తాన్ శ్రీలంకపై గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. శ్రీలంకకు 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అఫ్గాన్ బ్యాట్స్ మెన్ సమిష్టిగా రాణించారు. 

అబుదాబి: ఆసియా కప్ లో భాగంగా జరిగిన మ్యాచులో శ్రీలంక పసికూన అఫ్ఘానిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన శ్రీలంక జట్టు దారుణమైన పరాభవాన్ని ఎదుర్కుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిపోయిన శ్రీలంక అఫ్ఘానిస్థాన్‌ చేతిలో 91 పరుగుల తేడాతో ఓడిపోయింది.

వరుసగా రెండు పరాజయాలతో ఈ జట్టు ఆసియా‌ కప్‌ నుంచి వైదొలిగింది. అఫ్ఘాన్‌తో పాటు బంగ్లాదేశ్‌ సూపర్‌ ఫోర్‌కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ శ్రీలంకకు 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక 41.2 ఓవర్లలో 158 పరుగులకు చేతులెత్తేసింది. 

ఉపుల్ తరంగ (36) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్లో పిచ్‌పై భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ తడబడింది. తొలి ఓవర్‌ నుంచే అఫ్ఘాన్‌ బౌలర్లు వికెట్ల వేట సాగించారు.  ఉపుల్‌ తరంగ (36), ధనంజయ డిసిల్వా (23) కాస్త నిలదొక్కుకున్నారు. దాంతో రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. 

ఆ తర్వాత తిసార పెరీర (28), మాథ్యూస్‌ (22) మినహా ఏ బ్యాట్స్‌మెన్‌ కూడా అఫ్గాన్ స్పిన్నర్లను ఎదుర్కోలేకపోయారు. దీంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. స్పిన్నర్లు ముజీబ్‌, రషీద్‌, నబీలతో పాటు పేసర్‌ గుల్‌బదిన్‌కు రెండేసి వికెట్లు లభించాయి.

ఆసియా కప్ లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచులో పసికూన అఫ్గనిస్తాన్ శ్రీలంకపై గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. శ్రీలంకకు 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అఫ్గాన్ బ్యాట్స్ మెన్ సమిష్టిగా రాణించారు. 

టాస్‌ గెలిచి  ఆఫ్గాన్‌ సారథి అస్ఘర్‌ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అఫ్గాన్ ఓపెనర్లు శుభారంభం చేశారు. తొలి వికెట్‌కు 57 పరుగుల జోడించారు. ఓపెనింగ్‌ జోడిని లంక స్పిన్నర్‌ అఖిల ధనుంజయ విడదీశాడు. 

మహ్మద్‌ షాజాద్‌(47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌ తో 34 పరుగులు)ను అఖిల ధనుంజయ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.  ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రెహ్మత్‌ షా(90 బంతుల్లో 5ఫోర్లతో 72 పరుగులు)తో కలిసి మరో ఓపెనర్‌ ఇషానుల్లా జనత్‌( 65 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు) శ్రీలంక బౌలర్లు ధాటిగా ఎదుర్కున్నారు.

రెండో వికెట్‌కు అర్దసెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడిని మరోసారి ధనుంజయ విడగెట్టాడు. అయితే మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్‌ చేయటంలో విఫలమయ్యారు. 

ఆఫ్గాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. లంక పేసర్‌ తిశార పెరీరా ఐదు వికెట్లు తీశాడు.  మిగతా లంక బౌలర్లలో  ధనుంజయ రెండు వికెట్లు తీయగా, మలింగ, చమీరా, జయసూర్య తలో వికెట్‌ తీశారు. 

శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 124 పరుగులకే ఆలౌటై 137 పరుగుల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. 

click me!