టీంఇండియా ఆ లోపాన్ని సరిదిద్దుకోకుంటే కష్టమే...మాజీ కోచ్ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Sep 17, 2018, 6:36 PM IST
Highlights

టీంఇండియా ఇటీవల ఇంగ్లాండ్ టూర్ లో ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బందిపై పలువురు మాజీలు విమర్శలకు దిగారు. తాజాగా ఈ విమర్శకుల జాబితాలో మాజీ కోచ్ గ్రెగ్ చాఫెల్ కూడా చేరిపోయాడు. అయితే అతడు టీంఇండియాను విమర్శించాడు అనే కంటే హెచ్చరించాడనే చెప్పాలి. ఇంగ్లాండ్ లో భారత ఆటగాళ్ల ఆటతీరు ఆధారంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఏ విభాగాల్లో మెరుగుపడాలో చాపెల్ సూచించారు.

ముఖ్యంగా భారత జట్టులో బ్యాటింగ్ లోపం కనిపిస్తున్నట్లు చాఫెల్ తెలిపారు. ఈ లోపాన్ని సరిదిద్దుకోడానికి ఇప్పటినుండే టీంఇండియా బ్యాట్ మెన్స్ సాధన చేయాలని సూచించారు. లేకుంటే నవంబర్ నుండి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. 

స్వదేశంలో ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎదుర్కొనడం భారత ఆటగాళ్లకు అంత సులువు కాదన్నారు. ఇంగ్లాండ్ టూర్ లో మాదిరిగానే బ్యాటింగ్ కొనసాగితే అదే రీతిలో పరాభవం తప్పదని హెచ్చరించారు. ఆసీస్ జట్టు ప్రస్తుతం బ్యాటింగ్ విభాగంలో కాస్త వీక్ గా ఉన్నా మిచెల్ స్టార్క్, హేజిల్ వుడ్, కమిన్స్ వంటి ఆటగాళ్లతో బౌలింగ్ విభాగం స్ట్రాంగ్ గా ఉందన్నాడు. వీరు విజృంభిస్తే టీంఇండియా బ్యాట్ మెన్స్ చేతులెత్తేయడం తప్ప చేసేదేముండదని చాఫెల్ హెచ్చరించారు.

ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ తర్వాత భారత జట్టు నవంబర్‌ 21 నుంచి జనవరి 18 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. దాదాపు రెండు నెలల పాటు ఆసీస్ గడ్డపై 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది.
 
click me!