బిగ్‌బాస్‌లోకి శ్రీశాంత్ ఎంట్రీ.. ఏడ్చేసిన భార్య

Published : Sep 17, 2018, 01:53 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
బిగ్‌బాస్‌లోకి  శ్రీశాంత్ ఎంట్రీ.. ఏడ్చేసిన భార్య

సారాంశం

బిగ్‌బాస్-12లో క్రికెటర్ శ్రీశాంత్ ఎంట్రీ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా శ్రీశాంత్ అద్భుతమైన్ డాన్స్ చేశారు. 

బిగ్‌బాస్-12లో క్రికెటర్ శ్రీశాంత్ ఎంట్రీ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా శ్రీశాంత్ అద్భుతమైన్ డాన్స్ చేశారు. సల్మాన్ ఆయనను స్వాగతించారు. తన భార్య భువనేశ్వరి కుమారి ‘బిగ్‌బాస్’కు పెద్ద ఫ్యాన్ అని శ్రీశాంత్ చెప్పారు.

సల్మాన్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తనకు, తన భార్యకు పదేళ్ల గ్యాప్ ఉందని శ్రీశాంత్ తెలిపారు. తరువాత సల్మాన్... శ్రీశాంత్ భార్యను వేదిక మీదకు పిలిచారు. ఈ సమయంలో శ్రీశాంత్ తన భార్య గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

స్పాట్ ఫిక్సింగ్‌లో తన పేరు వచ్చినపుడు ప్రపంచమంతా తనను అదోలా చూసిందని, తన భార్య మాత్రం తన భాధను మరిపిందని అన్నారు. ఈ మాటలు విన్న శ్రీశాంత్ భార్య రోదించారు. దీంతో శ్రీశాంత్ ఆమెకు దగ్గరకు తీసుకుని, తనకు ఇలాంటి భార్య దొరకడం గుడ్‌లక్ అన్నారు.

PREV
click me!

Recommended Stories

IPL చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-5 విదేశీ ఆటగాళ్లు వీరే.. లిస్టులో ఆసీస్ డామినేషన్!
ఎలుకకు పిల్లి సాక్ష్యం అంటే ఇదేనేమో.! 'టీ20 ప్రపంచకప్‌ను గిల్ తెచ్చేస్తాడట'.. నమ్మేశాం.. నమ్మేశాం