ఫ్రాన్స్ హీరో అంటోనీ గ్రీజ్‌మ్యాన్ ‌( వీడియో)

 |  First Published Jul 7, 2018, 1:01 PM IST

ఫిఫా ప్రపంచకప్‌లో మాజీల పోరు ముగిసింది. ఉరుగ్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ 2-0తో గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. కెప్టెన్, గోల్ కీపర్ హ్యూగో లోరిస్, స్టార్ ఆటగాడు అంటోనీ గ్రీజ్‌మ్యాన్‌లు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు


ఫిఫా ప్రపంచకప్‌లో మాజీల పోరు ముగిసింది. ఉరుగ్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ 2-0తో గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. కెప్టెన్, గోల్ కీపర్ హ్యూగో లోరిస్, స్టార్ ఆటగాడు అంటోనీ గ్రీజ్‌మ్యాన్‌లు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. యావత్ దేశం ఇప్పుడు వీరిద్దరిని ప్రశంసలతో ముంచెత్తుతోంది. ముఖ్యంగా గ్రీజ్‌మ్యాన్‌ను ఆకాశానికెత్తెస్తోంది ఫ్రాన్స్ మీడియా. ఒక గోల్  కొట్టడంతో పాటు.. మరో కీలకగోల్‌లోనూ గ్రీజ్ ముఖ్యభూమిక పోషించాడు. అందుకే అతన్ని ‘ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ’ అవార్డు వరించింది. అతని గురించి ఒకసారి చూస్తే:

* 2016 యూరోకప్‌లో జట్టును ఫైనల్స్‌కు చేర్చిన ఘనత గ్రీజ్ మ్యాన్‌దే.. జర్మనీతో  జరిగిన సెమీ ఫైనల్స్‌లో రెండు గోల్స్ చేసి జట్టును ముందుండి నడిపించాడు.. అంతేకాదు ఈ టోర్నీలో మొత్తం 9 గోల్స్ కొట్టి అత్యధిక గోల్స్  కొట్టిన ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు.

Latest Videos

undefined

* 2016 యూరో కప్‌లో అత్యధిక గోల్స్ (6) సాధించిన ఆటగాడిగా ‘ప్లేయర్ ఆఫ్ ది సీరిస్’ అందుకున్నాడు.

* 2017లో జరిగిన ఛాంపియన్ లీగ్‌ మ్యాచ్‌లో పర్‌ఫెక్ట్ టైమింగ్‌తో సీజర్స్ కిక్ గోల్ ప్రేక్షకులతో పాటు ఫుట్ బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.. దశాబ్ధాల చరిత్ర కలిగిన ఛాంపియన్స్ లీగ్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యుత్తమ గోల్‌గా గ్రీజ్‌మ్యాన్ కొట్టిన గోల్ ఎంపికైంది.

* క్వార్టర్స్‌లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన గ్రీజ్‌మ్యాన్ ప్రపంచకప్‌లలోనూ, యూరోపియన్ ఛాంపియన్ షిప్‌లలోనూ నాకౌట్ స్టేజ్‌లో ఏడు గోల్స్ కొట్టాడు.

* మెగా టోర్నీల్లో తాను ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ చేసిన 12 గోల్స్‌ల్లో గ్రీజ్‌మ్యాన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది. 

* గ్రీజ్‌మ్యాన్ ఆడిన మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్  విజయాల శాతం 69శాతంగా నమోదవ్వగా.. అతను లేని మ్యాచ్‌ల్లో 50శాతం మాత్రమే ఫ్రాన్స్ విజయాలను అందుకుంది.

* ప్రపంచకప్‌లో సగటున ప్రతి 151 నిమిషానికి గ్రీజ్‌మ్యాన్ ఒక గోల్ సాధించాడు.

* అదే యూరో కప్‌లో అయితే  ప్రతి 92 నిమిషాలకు ఒక గోల్ కొట్టాడు.

* ఫిఫా ఆరంబానికి ముందు జరిగిన మూడు వార్మప్ మ్యాచ్‌ల్లో ప్రతి 172 నిమిషాలకు గ్రీజ్‌మ్యాన్ ఒక గోల్ కొట్టాడు.

"

click me!