షాక్... క్రికెటర్ అంబటి రాయుడిపై నిషేధం

By Arun Kumar PFirst Published Jan 28, 2019, 2:11 PM IST
Highlights

తెలుగు ఆటగాడు, టీంఇండియా క్రికెటర్ అంబటి రాయుడు ఐసిసి( ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) నిషేదానికి  గురయ్యాడు. అతడి బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు వ్యక్తం చేసిన ఐసిసి అంతర్జాతీయ క్రికెట్ లో బౌలింగ్ చేయకుండా నిషేదం విధిస్తూ సంచలన నిర్ణయం  తీసుకుంది. 

తెలుగు ఆటగాడు, టీంఇండియా క్రికెటర్ అంబటి రాయుడు ఐసిసి( ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) నిషేదానికి  గురయ్యాడు. అతడి బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు వ్యక్తం చేసిన ఐసిసి అంతర్జాతీయ క్రికెట్ లో బౌలింగ్ చేయకుండా నిషేదం విధిస్తూ సంచలన నిర్ణయం  తీసుకుంది. 

కొద్దిరోజుల క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రాయుడు వేసిన ఆఫ్ స్పిన్ బౌలింగ్ యాక్షన్ పై అభ్యంతరం వ్యక్తమయ్యింది. దీంతో ఐసిసి అతడిపై  చర్యలకు దిగింది. అతడి బౌలింగ్ యాక్షన్‌పై  భారత జట్టు మేనేజ్‌మెంట్ కు నివేదిక ఇవ్వడంతో పాటు...14 రోజుల్లో ఐసిసి నిర్వహించే పరీక్షకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.

అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఐసిసి నోటీసులను పట్టించుకోని రాయుడు బౌలింగ్ టెస్ట్ కు హాజరుకాలేదు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ నియమ నిబంధనల మేరకు అంతర్జాతీయ మ్యాచుల్లో అతడు బౌలింగ్ చేయకుండా నిషేధం విధిస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది. 

ఈ నెల 13వ తేదీ వరకు తన బౌలింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు అంబటి రాయుడికి అవకాశమిచ్చినట్లు ఐసిసి అధికారులు తెలిపారు. అయితే ఆ సమయంలోపు అతడు పరీక్షకు హాజరుకాకపోవడం వల్ల బౌలింగ్ పై నిషేధం విధించింనట్లు వెల్లడించారు. 

ఆస్ట్రేలియా పర్యటన ముగియగానే భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. భారత జట్టుతో పాటు రాయుడు కూడా న్యూజిలాండ్ వెళ్లాడు. ఇలా బిజీ షెడ్యూల్ నేపథ్యంలో అతడు ఐసిసి బౌలింగ్ పరీక్షకు హాజరుకాలేక పోయాడు. ఇంతోలనే అతడిపై నిషేధం పడింది.  
   

సంబంధిత వార్తలు

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడికి షాక్

  

click me!