పాండ్యా రీ ఎంట్రీ: కళ్లు చెదిరే క్యాచ్‌తో అభిమానులు థ్రిల్

sivanagaprasad kodati |  
Published : Jan 28, 2019, 12:28 PM IST
పాండ్యా రీ ఎంట్రీ: కళ్లు చెదిరే క్యాచ్‌తో అభిమానులు థ్రిల్

సారాంశం

మహిళలపై అసభ్యకర పదజాలంతో వ్యాఖ్యానించి బీసీసీఐ ఆగ్రహానికి గురైన టీమిండియా క్రికెటర్ హార్డిక్ పాండ్యా తిరిగి భారత జట్టును చేరాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగనీలో మ్యాచ్‌లో పాల్గొన్న అతను కళ్లు చెదిరే క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. 

17వ ఓవర్‌లో స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో కవీస్ కెప్టెన్ విలియమ్సన్ ఫ్రంట్‌కొచ్చి భారీ షాట్ ఆడారు. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంతిని ఫార్వార్డ్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న పాండ్యా డైవ్ చేసి అందుకున్నాడు.

రెప్పపాటులో జరిగిన ఈ అద్భుతంతో అభిమానులు, మిగిలిన క్రికెటర్లు షాక్‌తో అలా ఉండిపోయారు. అప్పటికే రెండు వికెట్లు పడి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటున్న విలియమ్సన్..పాండ్యా క్యాచ్‌తో నిరాశగా మైదానాన్ని వీడాడు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో పాండ్యా అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం ‘‘పాండ్యా ఈజ్ బ్యాక్.. దటీజ్ పాండ్యా అంటూ‘’’ అతన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?
IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?