పదేళ్ల నిరీక్షణ... అప్పుడు ధోనీ సేన, ఇప్పుడు కోహ్లీ సేన

By Arun Kumar PFirst Published Jan 28, 2019, 5:36 PM IST
Highlights

న్యూజిలాండ్ జట్టును వారి స్వదేశంలోనే మరోసారి మట్టికరింపించి కోహ్లీ సేన అద్భుతం సృష్టించింది. అయితే ఇలా కివీస్ జట్టును వారి స్వదేశంలో ఓడించడానికి భారత జట్టుకు పదేళ్ల సమయం పట్టింది. ఈ పదేళ్ళలో భారత జట్టు అనేక పర్యాయాలు కివీస్ పర్యటన చేపట్టినా ఒక్క వన్డే సీరిస్ కూడా సాధించలేకపోయింది. తాజా కోహ్లీ సారథ్యంలోని జట్టు ఈ నిరీక్షణకు తెరదించింది. 

సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2009 సంవత్సరంలో ధోని సారథ్యంలోని భారత జట్టు న్యూజిల్యాండ్ లో అద్భుతం చేసింది. వారి స్వదేశంలో జరిగిన వన్డే సీరిస్ ను 3-1 తేడాతో  గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత కివీస్ జట్టు భారత్‌కు మరోసారి ఆ అవకాశం ఇవ్వలేదు. 

అయితే ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయం సాధించిన ఉత్సాహంతో న్యూజిలాండ్ లో అడుగుపెట్టిన కోహ్లీ సేన జోరును మాత్రం అడ్డుకోలేకపోయింది.న్యూడిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ ను మరో రెండు వన్డేలు మిగిలివుండగానే టీంఇండియా కైవసం చేసుకుంది. ఇలా 2009 విజయాన్ని మరిపించేలా ఏకపక్ష విజయాన్ని కోహ్లీ సేన అందుకుంది. 

ఇప్పటికే ఐదు వన్డేల సీరిస్ లో భాగంగా జరిగిన రెండు వన్డేల్లోనూ భారత్ విజయం సాధించింది. ఇక సీరిస్ విజయం కోసం కివీస్ చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో వన్డే ఇవాళ మౌంట్ మాంగనస్ లో జరిగింది. ఇందులో కూడా బ్యాట్ మెన్స్ తో పాటు బౌలర్లు చేతులెత్తేయడంతో కివీస్ ఓటమిపాలయ్యింది. ఇలా కివీస్ ఈ మ్యాచ్ నే కాదు సీరిస్ ను కోల్పోవాల్సి వచ్చింది. 

ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 243 పరుగులు మాత్రమే చేయగల్గింది.   244 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్ మెన్స్ ని కివీస్ బౌలర్లు ఏ దశలోనూ అడ్డుకోలేక పోయారు. ఈ మ్యాచ్ లో చెలరేగి పోయిన ఓపెనర్ రోహిత్, కెప్టెన్ కోహ్లీ లు అర్థ శతకాలు సాధించారు. చివర్లో వీరు ఔటయినా అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ లాంఛనాన్ని పూర్తి చేసి టీంఇండియాకు మరో మరుపురాని విజయాన్ని అందించారు. 
 
click me!