Ugadi 2022 Wishes: మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి!

By Navya ReddyFirst Published Apr 2, 2022, 8:05 AM IST
Highlights

Ugadi 2022: తెలుగు పండుగ.. ఎంతో ముఖ్యమైన పండుగ ఉగాది వచ్చేసింది. సంవత్సరం అంత ఎన్ని పండుగలు వచ్చిన ఈ పండుగకు ఉన్న ప్రత్యేకత వేరు. అలాంటి ఈ పండుగకు మన కుటుంబసభ్యులకు, మిత్రులకు ఇక్కడ రాసిన కోట్స్ చూసి విష్ చెయ్యండి. 

Ugadi 2022: భారతదేశంలో ఎంతో ముఖ్యమైన పండుగ ఉగాది. ఇంగ్లీష్ కొత్త సంవత్సరం వచ్చిన మూడు నెలలు తర్వాత తెలుగు కొత్త సంవత్సరం వస్తుంది. అదే ఈ ఉగాది. ఈ పండుగా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకాలుగా ఎంతో ఘనంగా చేసుకుంటారు. మరీ ఈ పండుగకు మీ ప్రియమైన వారికి ఈ కోట్స్, మెసేజ్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పండి..

మీకు మీకుటుంబ సభ్యులకు...
శుభకృతనామ ఉగాది పండుగ శుభాకాంక్షలు!

తీపి, చేదు కలిసిందే జీవితం... కష్టం, సుఖం తెలిసిందే జీవితం.. ఆ జీవితంలో ఆనందోత్సాహాలు పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం. 
మీకు మీకుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు!

కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త సంవత్సరం...
ఈ సంవత్సరమంతా జయాలు కలగాలి.
సంతోషాలు పొంగాలి
ఉగాది శుభాకాంక్షలు

షడ్రుచులు మేళవింపులాంటిదే జీవితం అని ఉగాది పర్వదినం గుర్తు చేస్తుంది. " సర్వేజనాః సుఖనోభవంతు " అనే విశ్వ సంస్కృతి వారసులుగా అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతున్ని ప్రార్థిస్తూ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 

మీకు, మీ కుటుంబ సభ్యులకు ' శ్రీ శుభకృత్' నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు

చిగురిస్తున్న కొమ్మలు  
లేలేత మామిళ్ళు 
నోరూరించే షడ్రుచులు 
అనుభవాల కలబోతలు 
ప్రకృతి కట్టిన పచ్చని 
తోరణాల నడుమ ముద్దబంతుల ముగ్ద మనోహర 
ద్రుశ్యాల సాక్షిగా  శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు..

ఈ ఉగాది పర్వదినాన ప్రజలంతా ‌ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఉగాది పండుగ శుభాకాంక్షలు

click me!