ugadi 2022 : ఉగాది పండుగ రోజు ఇలా చేస్తే ఆ ఏడాదంతా మీరు సుఖ సంతోషాలతో ఉంటారట..

By Mahesh RajamoniFirst Published Apr 1, 2022, 4:28 PM IST
Highlights

ugadi 2022 : తెలుగు ప్రజలకు ఉగాదితోనే కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ పండుగ పర్వదినాన కొన్ని పనులను చేయడం ద్వారా ఆ ఏడాదంతా మీ కుంటుంబం సుఖ సంతోషాలతో ఉంటారని పెద్దలు చెబుతున్నారు. 
 

ugadi 2022 : ఉగాది పండుగను ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ పండుగ మన మొదటి పండుగ. ఈ కొత్త సంవత్సరం రోజున ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉంటారు. ఉగాది యుగాది అనే పదం నుంచి పుట్టింది.. 

పురాణాల ప్రకారం..  బ్రహ్మ దేవుడు ఈ అనంతమైన విశ్వాన్ని ఉగాది రోజునే అంటే చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి రోజునే సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు నుంచే ఈ లోకం ప్రారంభమయ్యిందని శాస్త్రాలు వివరిస్తున్నాయి.  

వేధాలను హరించిన సోమకుడిని  శ్రీ మహా విష్ణువు మత్స్యవతారం ఎత్తి అతడిని సంహరిస్తాడు. అంతేకాదు వేధాలను ఆ బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. ఈ  సందర్బంగా కూడా ఉగాది పండుగను జరుపుకుంటున్నామని పురాణాల్లో ఉంది.

అంతేకాదు ఈ చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజునే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజున నూతన జీవితానికి నాందిగా సెలబ్రేట్ చేసుకుంటారు. 

ఉగాది ని యుగాది అని కూడా అంటారు. ప్రస్తుతం ఈ రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర  గమనం అని అర్థం. అంటే  సృష్టి ఆరంభమైనదని ఉగాదికి అర్థం వస్తుంది. 

ఇకపోతే రేపే (ఏప్రిల్ 2)మనం శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నం. అయితే ఈ పండుగ రోజున కొన్ని పనులను చేస్తే..ఆ ఏడాదంతా మనం సుఖ సంతోషాలతో ఉంటామని పెద్దలు చెబుతున్నారు. అందుకోసం పండుగ రోజు ఏం చేయాలంటే.. 

1. ఉగాది పర్వదినాన సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. తలకు నువ్వుల నూనె, ఒంటికి నలుగు పిండి పెట్టుకుని శుభ్రంగా తలస్నానం చేయాలి. 

2. ఈ రోజున ఖచ్చితంగా కొత్త బట్టలను వేసుకోవాలని పెద్దలు చెబుతున్నారు. 

3. పూజా గదిని అలంకరించి.. ఉగాది పచ్చడిని చేసి మీ ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు కూడా స్వీకరించాలి. 

4. సాయంత్రం వేళల్లో మీకు సమీపంలో ఉన్న గుడికి వెళ్లి దైవ దైర్శనం తప్పని  సరిగా చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. 

5. ఉగాది నుంచి మొదలు పెడితే.. శ్రీరామ నవమి వరకు శుచి శుభ్రత పాటించాలి. 

6. ఉగాది పర్వదినాన పంచాంగం శ్రవణం తప్పక వినాలి. ఆ రోజు మీ ఆదాయ వ్యాయాలు, ఖర్చులు, సంపాదన, భవిష్యత్ ఎలా ఉండబోతోంది అన్న విషయాలు తెలుస్తాయి. 

7. మొత్తంగా ఉగాది పండుగ స్పెషల్ ఉగాది పచ్చడి, భక్షాలు, గోపూజ వంటివి ఆచారాలను తప్పక పాటించాలని పెద్దలు చెబుతున్నారు. 
 

click me!