Ramadan 2022: రంజాన్ పండుగ మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుందో..

By Mahesh RajamoniFirst Published Mar 30, 2022, 4:56 PM IST
Highlights

Ramadan 2022: మనం జరుపుకునే ప్రతి పండుగ వెనక ఏదో ఒక పరమార్థం దాగే ఉంటుంది.  ముస్లింలకు ఎంతో విత్రమైన ఈ రంజాన్ పండుగ వల్ల శారీరక, మానసిక వికాసంతో పాటుగా మరెన్నో విశేషాలు కలుగుతాయి. 

Ramadan 2022: ప్రతి పండుగ వెనక ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. చరిత్రలో తమకంటూ స్థానం సంపాదించుకుని అమరులైన వారిని గుర్తు చేసుకోవడానికి, చెడు పై మంచి గెలిచిందన్న దానికి గుర్తుగానో పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం అనావాయితీగా వస్తుంది. వీటితో పాటుగా మనల్ని సన్మార్గంలో నడిపించే పండుగలు కూడా  ఉంటాయి. అందులో రంజాన్ ఒకటి. ఈ పండుగ ముస్లింలకు ఎంత పవిత్రమైంది. 

రంజాన్ పండుగ మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. ఈ పండుగలో పాటించే ప్రతి పద్దతి.. మనిషికి క్రమ శిక్షణ ఉండాలని, దాన ధర్మాలు చేయాలని, దయాగుణం కలిగి ఉండాలని నిరంతరం తెలియజేస్తూనే ఉంటాయి.  ఈ పండుగ  వల్ల శారీరక వికాసంతో పాటుగా మానసిక వికాసం కూడా కలుగుతుంది. మరెన్నో విశేషాలు ఈ పండుగలో దాగున్నాయి. ఆ  విశేషాలేంటో తెలుసుకుందాం. 

రంజాన్ పండుగ నెలవంక దర్శనంతో ప్రారంభమవుతుంది. ముస్లింలకు ఎంతో పవిత్రమైన ఖురాన్ రంజాన్ మాసంలోనే పుట్టిందని వారు నమ్ముతారు. అందుకే ఈ పండుగ వారికెంతో ప్రత్యేకమైంది. పవిత్రమైంది. ఖురాన్ బోధన ప్రకారం.. ముస్లింలు ఎంతో కఠినంగా రోజుకు 13 గంటల పాటు నిష్టగా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం నుంచి ఉపవాసం మొదలై సూర్యాస్తమయానికి ముగుస్తుంది. 

ఉపవాసం చేసేవారు ఎట్టిపరిస్థితిలో అబద్దాలను చెప్పకూడదు. చెడు మాటలను మాట్లాడకూడదు. వినకూడదు. ఆ అల్లాహ్ లై మనస్సును నిలపాలి. ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందనుకుంటే పొరపాటే.. మనస్సును, శరీరాన్ని చెడు మార్గంలో మల్లించకుంటేనే ఉపవాస దీక్షా ఫలం దక్కుతుంది. 

ఈ రంజాన్ వేళ ముస్లింలందరూ పేదలకు దాన ధర్మాలను చేస్తుంటారు. దీన్నే వాళ్లు జకాత్ అంటుంటారు. ఒక్కపూట పేదవారికి ఆహారాన్ని దానం చేస్తే.. తమకు వెయ్యి పూటల ఆహారాన్ని ఎలాంటి కష్టం లేకుండా అందిస్తాడని వీరు నమ్ముతారు. అందుకే మసీదుల వద్ద ఉండే వికలాంగులకు, భిక్షటన చేసేవారికి డబ్బులు, ఆహారం అందిస్తూ ఉంటారు. 

ఈ పండుగ సందర్భంగా కేవలం ధనికులే కాదు ఇతరులు కూడా పేదలకు దాన ధర్మాలు చేస్తారట. ఇక ఈ పండుగ చివరి రోజు నెల వంకను  దర్శించుకుని వారి ఉపవాస దీక్షను ముగిస్తారు. ఆ తర్వాతి రోజు రంజాన్ ఫెస్టివల్ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు నాడు కొత్తబట్టలు వేసుకుని మసీదులకు వెళతారు. అక్కడ అల్లాహ్ కు ప్రార్థించి ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ ఒకరికి ఒకరు చెప్పుకుంటారు. ఈ పండుగ స్పెషల్ గా బిర్యానీలు, రకరకాల మాంసాహారం, సేమ్యా ఖీర్ ను వింధును ఆరగిస్తారు. 

click me!