Akshaya Tritiya 2022 : అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి.. ఈ ఏడాది ఎప్పుడు.. ఏ సమయంలో జరుపుకోవాలి.. ఫుల్ డిటేయిల్స్!

By Navya Reddy  |  First Published Apr 28, 2022, 4:22 PM IST

హిందువులు జరుపుకునే పండుగల్లో అక్షయ తృతీయ (Akshaya Tritiya) చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు విలువైన వస్తువులు బంగారం, వెండి కొనుగోలు చేయడం ద్వారా తమ జీవితాల్లో చేసిన తప్పులు, అప్పులు  అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి.  అక్షయ తృతీయకే మరోపేరు అఖా తీజ్. అక్షయ తృతీయ అక్షరార్థం 'అంతులేని శ్రేయస్సు' అని. వసంత రుతువులో జరుపుకునే ఈ పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం శుక్ల పక్షం (చంద్రుని వృద్ధి చెందుతున్న దశ) మూడవ రోజు (తృతీయ)న వైశాఖ మాసంలో వస్తుంది. 
 
భారతదేశం మరియు నేపాల్ దేశాల్లోని హిందువులు మరియు జైనులు తమ ఇంట్లోకి అదృష్టం, శ్రేయస్సును ఆహ్వానించడానికి ఈ పండుగను ఎంతో శ్రద్ధగా జరుపుకుంటారు. అయితే 2022లో అక్షయ తృతీయను ఏరోజున జరుపుకోవాలనే సందేహం అందరిలో నెలకొని ఉంది. మే 3న (మంగళవారం) లేదా మే 4 (బుధవారం) తేదీలు  అక్షయ తృతీయ పండుగకు అనుమైనవే. తెలుగు సంవత్సర క్యాలెండర్‌ ప్రకారం తదియ తిధి మే 3న ఉదయం 5:19 నిమిషాల నుంచి మే 4 బుధవారం ఉధయం 7:33 నిమిషాల వరకు ఉంది. 

Latest Videos

అయితే మే 3నే అక్షయ తృతీయను జరుపుకోవాలని పలువురు పండితులు సూచిస్తున్నారు. ఆరోజునే పూజా కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఉదయం 5:30  నుంచి మధ్యాహ్నం 12 :18 నిమిషాల వరకు శుభముహుర్తం ఉన్నట్టు చెబుతున్నారు. ఈ సమయంలోనే పూజను పూర్త చేయాలని తెలుపుతున్నారు. కానీ, బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం మే 3 ఉదయం 5 గంటల నుంచి మే 4 ఉదయం 7 గంటల వరకు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని జ్యోతిష్యుకులు సూచిస్తున్నారు. 
 
అక్షయ తృతీయ రోజు లక్ష్మిదేవితో పాటు కుబేరులను కూడా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు తమను వరిస్తాయని శాస్త్రాలు తెలుపుతున్నాయి. అదే విధంగా సకల సౌకర్యాలు, సుఖ:శాంతుల కోసం పసుపు, కుంకుమ, మంచం, మారేడు  దళాలు, వస్త్రాలను దానం చేస్తే మంచిదని హిందుల నమ్మకం. కొందరు కుంకుమ, తులసి ఆకులు, కర్పూరం, తులసి మరియు తమలపాకులతో పాటు నీటితో నింపిన కంచు లేదా వెండి పాత్రలను కూడా దానం చేస్తారు. అలాగే మధుసూదన ఆచారం, తులసి పూజ మరియు విష్ణు సహస్రనామం జపించడం మంచిదట. అదనపు  పుణ్యాన్ని పొందాలనే ఆశతో ఉన్న వారు  ఈ రోజున దానధర్మాలు చేత్తంగా ఉత్తమంగా చెబుతున్నారు.

click me!