
Varalakshmi Vratam 2023: ప్రతి ఏడాది శ్రావణ మాసం చివరి శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని జరుపకుంటారు. కాగా వరలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్నిపెళ్లైన ఆడవారు చేస్తారు. ఈ వ్రతం వల్ల ఇంటిళ్లి పాది ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని నమ్మకం. వరలక్ష్మీ వ్రతంతో అమ్మావారి అనుగ్రహం పొందితే.. కష్టాలన్నీ తీరిపోయి.. సౌభాగ్యం, ఆనందం, సుఖసంతోషాలు కలుగుతాయని ప్రజలు నమ్ముతారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పెళ్లైన ఆడవారే కాదు.. పెళ్లి కాని యువతులు కూడా ఈ ఉపవాసం ఉండొచ్చు. కాగా ఈ వరలక్ష్మీ వ్రతం గురించి ఎన్నో పురాణాలు, ఇతిహాసాల్లో ఉంది.
ఒక ప్రసిద్ద పౌరాణిక పురాణం ప్రకారం.. భారతదేశంలోని కౌండిన్యాపూర్ అనే పురాతన పట్టణంలో చారుమతి అనే మహిళ ఉండేది. ఆమె లక్ష్మీదేవి భక్తురాలు. ఈ భక్తికి, ప్రేమకు ముగ్దురాలైన లక్ష్మీదేవి ఆమెకు కలలో కనిపించి అనుగ్రహించింది. అలాగే కలలో వరలక్ష్మీ వ్రతం, ఉవవాసం గురించి చెప్పింది. ఇవి పాటించడం వల్ల ఆరోగ్యం, సంపద, అదృష్టం ఎలా కలుగుతాయో వివరించింది. ఈ కలతో ప్రేరణ పొందిన చారుమతితో పాటుగా ఎంతో మంది మహిళలు ఉపవాసం ఉండి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందారు.
రెండో పౌరాణిక సంఘటన ప్రకారం.. పార్వతీ దేవి ఒకసారి ఆనందం, శాంతి, మంచి ఆరోగ్యం కోసం ఉపవాసం ఉన్నది.అయితే వరలక్ష్మీ వత్రం గురించి ఉన్న పెద్ద అపోహ ఏంటంటే.. ఈ వ్రతాన్ని కేవలం పెళ్లైన ఆడవారే చేయాలి. ఉపవాసం ఉండాలని. కానీ ఈ ఉపవాసానికి ఇలాంటి ఆంక్షలు లేవు. ఈ ఉపవాసం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఆర్థిక కష్టాలు కూడా పోతాయి.
లక్ష్మీదేవి 8 రూపాలు సంపద, భూమి, విద్య, కీర్తి, ప్రేమ, శాంతి, ఆనందం, బలం. దేవత ఎనిమిది అవతారాలు ఒకేసారి ప్రసన్నం అయినప్పుడు ఉపవాసం ఉండే ఆడవార, ఆమె కుటుంబం మొత్తం ఆరోగ్యం, సంపద, కీర్తితో ఆశీర్వదించబడుతుంది. లక్ష్మీదేవి ఎనిమిది రూపాలు..
ఆదిలక్ష్మీ
ధనలక్ష్మీ
ధైర్యలక్ష్మీ
సౌభాగ్య లక్ష్మి
విజయ లక్ష్మి
ధన్యలక్ష్మి
సంతాన లక్ష్మి
విద్యా లక్ష్మి
వరలక్ష్మీ వ్రతంలో ఆడవారు చేయకూడని పనులు?
ఇది తేలిగ్గా తీసుకునే ఉపవాసం కాదు. ఉపవాసం చేసేవారు నిష్టగా ఉండాలి. ఉపవాసం ఉండేవారు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
టీ తాగొద్దు: ఉదయాన్నే టీ తాగే అలవాటు చాలా మందికే ఉంటుంది. కానీ వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారు టీ తాగడం, భోజనం చేయడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇవి పూర్తిగా నిషిద్దం.
భోజనం తినకండి: వత్రం ఉండేవారు కేవలం పండ్లు మాత్రమే తినాలి. అది కూడా పూజ పూర్తి చేసిన తర్వాత రాత్రి మాత్రమే. మరుసటి రోజు మాత్రం ఆహారాన్ని తినాలి.
పీరియడ్స్ వస్తే: కఠినమైన నియమం లేనప్పటికీ... హిందూ సంప్రదాయాల ప్రకారం.. పీరియడ్స్ సమయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించకపోవడే మంచిది. ఈ సమయంలో మీకు పీరియడ్స్ ఉంటే మీ ఉపవాసాన్ని వాయిదా వేసుకోండి. మీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత మొదటి శుక్రవారం ఉపవాసం ఉండండి.
గర్భిణీ స్త్రీలు: గర్భిణీ స్త్రీలు వరలక్ష్మీ పూజ చేయొచ్చు. కానీ మీ ఆరోగ్యం బాగుంటేనే ఈ పూజ చేయాలి. అలాగే ఈ ఉపవాసంలో ఏం తినలేరు కాబట్టి ఉపవాసం ఉండకపోవడమే మంచిది.