Ramadan 2022: రంజాన్ ఉపవాసం ఉండే వారు తప్పక పాటించాల్సిన నియమాలు..

By Mahesh Rajamoni  |  First Published Mar 30, 2022, 1:09 PM IST

Ramadan 2022: ఖురాన్ ప్రకారం.. ఉపవాస దీక్ష చేసే వారు ఖచ్చితంగా కొన్ని నియమాలను విధిగా పాటించాల్సి ఉంటుంది. అవి పాటించినప్పుడు ఉపవాస ఫలం దక్కుతుంది. 
 


Ramadan 2022: రంజాన్ పండుగ మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు ముస్లింలు విధిగా, ఎంతో నిష్టగా ఉపవాసం చేస్తుంటారు. ఈ ఉపవాస దీక్షకేవలం ఆహారాలను తినకపోవడమే కాదు.. నిష్టగా ఉంటూ.. నియమాలను పాటిస్తూ గడిపే జీవన విధానం కూడా.

ఉపవాసం చేసేవారు తెల్లవారుజామున భోజనం చేసి.. సూర్యస్తమయం వరకు ఎలాంటి ఆహార పదార్థాలను తినరు. సూర్యాస్తమయం కాగానే ఉపవాస దీక్షను వదిలేస్తారు. అంటే రంజాన్ పండుగ ముగిసే వరకు ప్రతిరోజూ 13 గంటల పాటు కఠిన ఉపవాసం చేస్తారు. 

Latest Videos

undefined

ఉపవాస దీక్ష చేసేవారు ఎట్టి పరిస్థితిలో వేరేవాళ్లను నిందించకూడదు. అబద్దాలు ఆడకూడదు. ఎలాంటి వాంఛలకు లొంగకూడదు. నిష్టగా ఆ అల్లాహ్ ను పూజిస్తూ..మనసును దైవచింతనలో ఉంచాలి. మనుషులను సన్మార్గంలో నడపడమే ఈ ఉపవాస దీక్షముఖ్య ఉద్దేశ్యం. 

ఉపవాసం చేసేవారు పాటించాల్సిన నియమాలు.. వయోజనులైన స్త్రీ పురుషులందరూ రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలి. కఠినమైన ఉపవాస దీక్షను పాటించాలి. 

పిల్లలు, ముసలివాళ్లు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణాలు చేసేవారు  ఉపవాస దీక్ష నుంచి మినహాయింపు పొందారు. వ్యాధిగ్రస్తులు, వయసుమీదపడ్డవాళ్లు ఇతర సమయాల్లో ఆ అల్లాహ్ ను పూజించి అనుగ్రహం పొందవచ్చని ఉంది. 

ఇకపోతే ఉపవాసం చేసేవారి నోటి నుంచి ఎట్టి పరిస్థితిలో చెడు మాటలను మాట్లాడకూడదు. అలాంటి మాటలను వినకూడదు కూడా. 

ఉపవాసం చేస్తున్నామని మనసు ఒక దగ్గర శరీరం ఒక దగ్గర ఉండచూడదు. ఉపవాస సమయంలో ఆ అల్లాహ్ పై మనసును ను నిలపాలి. చెడు కార్యాల వైపు మల్లకూడదు. 

ఈ సమయంలో చెడు పనుల జోలికి అస్సలు వెళ్లకూడదు. అలాగే ఎవరైతే అక్రమంగా సంపాదిస్తారో అలాంటి వారు ఇఫ్తార్ విందు ను తమ కష్టార్జితంతోనే ఇవ్వాలట. 

ఒకరిపై చాడీలు చెబుతూ.. నోటికొచ్చిన అబద్దం ఆడుతూ.. టైం పాస్ ముచ్చట్లతో కాలాన్నివెళ్లదీయకూడదు. ఇవన్నీ ఉపవాస దీక్ష లక్షణాలు కావు. 

click me!