Sri Rama Navami 2022: శ్రీరామ నవమి విశిష్టత.. శ్రీరాముడి గొప్పతనం మనకు ఆదర్శం

By Mahesh RajamoniFirst Published Apr 5, 2022, 4:59 PM IST
Highlights

Sri Rama Navami 2022: ఆ శ్రీరాముడి గురించి, అతని వైభోగం గురించి ఆ మహాగాధను ఎన్ని సార్లు చెప్పుకున్నా.. ఎన్ని సార్లు విన్నా తిక్కువేనోమో అనిపిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రీ రామ నవమి నాడే ఆ శ్రీరాముడి కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.
 

Sri Rama Navami 2022: ఏకపత్నీవ్రతుడు, మాట తప్పవి వీరుడు, మడమ తిప్పని శైర్యం ఇవన్నీ కలిపితేనే ఆ దేవదేవుడు శ్రీరామ చంద్రమూర్తి. ఈ దేవుడిని ఆదర్శంగా తీసుకుని ప్రతి పురుషుడూ మెలగాలని మన పెద్దలు చెబుతుంటారు. అవును ఈ శ్రీరామ చంద్రుడిని దేవుడిలా కాకుండా ఒక మనిషిలా చూస్తే.. ప్రతివ్యక్తికి ఆదర్శంగా నిలుస్తాడు. 

హిందూ క్యాలెండర్ ప్రకారం.. చైత్ర శుద్ద నవమినాడు అంటే మనం జరుపుకునే శ్రీ రామ నవమి నాడే ఈ శ్రీరాముడి కళ్యాణం జరిగిందట. అలాగే ఆ రోజు ఈ దేవుడి పట్టాభిషేకం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజున హిందువులంతా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయినా ఈశ్రీరామ చంద్రమూర్తి గురించి ఎన్ని సార్లు విన్నా.. ఎన్ని సార్లు చదివినా విసుగంటూ రాదేమో కదా.. శ్రీరాముడి గురించి మనకు తెలిసిన , తెలియని కొన్ని విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.

పురాణాల ప్రకారం.. శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడు. ఇతనికి తండ్రి అంటే అమితమైన గౌరవం. తండ్రి చెప్పాలే గాని ఏపనైనా ఇట్టేచేసే గుణం కలవాడు. తండ్రి మాటకు కట్టుబడే ఉంటాడు. అందుకే కదా తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం.. సతీసమేతంగా, తన తమ్ముడుు లక్ష్మణుడితో కలిసి 14 ఏండ్లు అడవులకు వెళ్లాడు. 

ఇకపోతే శ్రీరాముడి బాణం ఎంతో శక్తివంతమైందని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరాముడు తనబాణాన్ని సంధిస్తే.. ఒకే ఒక్క సారికి ఆ రాజ్యంలోని శత్రువుల సైన్యాన్ని పూర్తిగా సంహరించగల శక్తివంతమైందని పురాణాలు చెబుతున్నాయి. 

రామరాజ్యం ఇలాగే ఉండేది.. ఆ సీతమ్మ తల్లిని రావణాసురుడు అపరిస్తాడు. అయితే శ్రీరాముడు రావణుడితో యుద్దం చేసి.. రావణాసురిడిని సంహరించి సీతమ్మను తీసుకుని ఆయోధ్యకు చేరుకుంటారు. ఆ తర్వాతే శ్రీరాముడు పట్టాభిషిక్తుడవుతాడు. ఆ తర్వాత శ్రీరామ చంద్రుడు తన రాజ్యాన్ని 11 ఏండ్ల పాటు పాలించాడని పురాణాలు చెబుతున్నాయి. 

శ్రీరాముడి పాలనంతా ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగానే ఉండేదట. తన పాలనలో ప్రజలు సుఖ: సంతోషాలతో వర్ధిల్లేలా చూసేవాడని పండితులు చెబుతున్నారు. శ్రీరాముడి పాలనలో వర్షాలు సకాలంలో పడి పంటలు సశ్యశామలంగా ఉండేవని పురాణాలు చెబుతున్నాయి. 

శ్రీరామ నవమి రోజున.. ఈ దేవుడి కళ్యాణాన్ని తిలకించి.. నిష్టగా పూజిస్తే.. సుఖ: సంతోషాలతో వర్ధిల్లుతారని పండితులు చెబుతున్నారు. అనేక జబ్బులు కూడా తొలగిపోతాయట. 

click me!