Sri Rama Navami 2022: శ్రీరాముడు గొప్ప వాడు. తండ్రి మాటకు కట్టుబడి నచుకునే గొప్ప మనసు కలవాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే పురాణాల ప్రకారం.. శ్రీరామ నవమి రోజు కొన్ని పనులను చేయకూడదట. అలా చేస్తే మీరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. అవేంటంటే..
Sri Rama Navami 2022: ప్రతి ఏడాది శ్రీరామ నవమిని వసంత కాలంలో చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకుంటాం. ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నఆ మహోన్నతమైన వ్యక్తి జన్మదినం రోజునే మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటున్నాం. అంతేకాదు ఈ రోజునే శ్రీరాముడు, సీతమ్మ తల్లి కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.
ఇంతటి పవిత్రమైన శ్రీరామ నవమి రోజు నాడు దేశవ్యాప్తంగా శ్రీరామ కళ్యాణోత్సవం ఘనంగా జరుపుకుంటారు. ఇకపోతే ఈ ఏడాది శ్రీరామ నవమి ఏప్రిల్ 10వ తారీఖున వచ్చింది. కాగా శ్రీరాముడు ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో మధ్యాహ్న సమయంలో పుట్టాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఆ రోజున శ్రీరాముడి కళ్యాణం గానీ, పూజా కార్యక్రమాలు గానీ ఆ రోజు మధ్యహ్న సమయంలోనే జరుగుతాయి.
undefined
ఈ సంగతి పక్కనపెడితే.. శ్రీరామ నవమి రోజున కొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రకాల పనులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
న్యాయంగా నడుచుకోండి.. మనలో చాలా మంది ఎన్నో తప్పులను చూస్తూ ఉంటారు. అది తప్పని తెలిసినా.. అలాగే చేసేవారున్నారు. అలా ఎప్పుడూ ప్రవర్తించకండి. తప్పుడు మార్గంలో ప్రయాణిస్తే.. జీవితంలో మీరు ఎన్నో కష్టాలను పడాల్సి వస్తుంది. అంతేకాదు ఆ దేవుడి దయ కూడా మీపై ఉండదు. కాబట్టి దేవుడి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉండాలంటే ఎప్పుడూ సత్యమే మాట్లాడండి. న్యాయంగా ప్రవర్తించండి.
నిజాయితీగా ఉండండి.. మీరు నిజాయితీగా ఉన్నప్పుడే మీకు అంతా మంచి జరుగుతుంది. అదే తప్పుడు మార్గంలో వెళితే మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. మీ కుటుంబం విషయంలోనైనా కానీ, బయట సమాజంలో అయినా కానీయండి.. ఎవ్వరితోనూ అబద్దాలు ఆడకండి. దీనివల్ల సమాజంలో మీకు మంచి పేరు రావడమే కాదు.. ఆ దేవుడి దయ కూడా మీపై ఉంటుంది.
పురాణాలు చదవండి.. మీకు పురాణాలను చదవాలని లేకపోయినా.. శ్రీరామ నవమి రోజున వేదాలను, పురాణాలను చదివాలని పండితులు చెబుతున్నారు. ఆరోజున శ్రీరాముడిని గొప్పతం తెలుసుకుని మనస్ఫూర్తిగా పూజిస్తూ ప్రార్థిస్తే.. మీరు అన్నివిధాల ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుంటారని పండితులు చెబుతున్నారు.
పెద్దలను గౌరవించండి.. శ్రీరాముడు పెద్దలను ఎంతో గౌరవించేవాడు. తన తండ్రి మాట జవదాటకుండా సతీసమేతంగా తన తమ్ముడు లక్ష్మణుడితో అడవులకు వెళ్లాడు. అంతేకాదు చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరినీ తమ ప్రియమైన వారిగా భావించేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి గొప్పదేవుడి అనుగ్రహం పొందాలంటే మీరు కూడా పెద్దలను గౌరవించాలని పండితులు చెబుతున్నారు.
శ్రీరామ నవమి నాడు చేయకూడదని పనులు.. శ్రీరామ నవమి నాడు మనం కొన్నిరకాల పనులను అస్సలు చేయకూడదు. అలా చేస్తతే.. ఆ దేవుడి అనుగ్రహం మనపై ఉండదు. అంతేకాదు దానివల్ల మనపై వ్యతిరేక ప్రభావం కూడా పడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. శ్రీరామ నవమి నాడు ఇతరులను అస్సలు బాధపెట్టకూడదు. వారిని నొప్పించకూడదు. ముఖ్యంగా మీరు శ్రీరాముడిని స్మరిస్తున్నప్పుడు ఆలోచనలు పక్కదారి పట్టకూడదు. మనసు శ్రీరాముడిపై కేంద్రీకరించాలి.
ముఖ్యంగా శ్రీరామ నవమి నాడు ఆల్కహాల్ ను తాగకూడదు. మాంసాహారాన్ని తినకూడదు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలను అస్సలు తినకూడదట. ఇవి తింటే నెగిటీవ్ ఎనర్జీ పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇతరులపై చాడీలు చెప్పడం, నిందించడం వంటివి చేయకూడదు. ముఖ్యంగా ఆ రోజున జుట్టును అస్సలు కత్తిరించరాదట. ఇలాంటి పనులు చేయకపోతేనే మీరు ఆర్థికంగా, ఆరోగ్యంగా బావుంటారని పండితులు చెబుతున్నారు.