Ganesh Chaturthi-2022: గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేయాలో తెలుసా?

By Navya ReddyFirst Published Aug 26, 2022, 4:10 PM IST
Highlights

Ganesh Chaturthi-2022: సాధారణంగా పండుగలు వస్తున్నాయంటే చాలు పెద్ద ఎత్తున స్వామివారికి నైవేద్యంగా ఎన్నో పిండి వంటలు తయారు చేసే స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విధమైనటువంటి పిండి పదార్థాలను తయారుచేసి పెద్ద ఎత్తున స్వామివారికి నైవేద్యంగా సమర్పించడమే కాకుండా ఇంటిల్లిపాది ఆ పిండి పదార్థాలను తినడానికి ఎంతో ఇష్టపడతారు.ఈ క్రమంలోనే త్వరలోనే వినాయక చవితి రానున్న నేపథ్యంలో బొజ్జ గణపయ్యకు ఇష్టమైన ఎన్నో రకాల పిండి పదార్థాలను నైవేద్యంగా పెడుతుంటాము. మరి గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం...

కావలసిన పదార్థాలు: బియ్యం పిండి ఒక కప్పు, పాలు ఒక లీటర్, బెల్లం తురిమినది ఒక కప్పు, శనగపప్పు అరకప్పు, కొబ్బరి ముక్కలు అర కప్పు, జీడిపప్పు బాదం కిస్మిస్ గుప్పెడు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నీళ్లు తగినన్ని

తయారీ విధానం: ముందుగా శనగపప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి. అలాగే పాలు బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణీలలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు బాదం కిస్మిస్ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణీలలో కొద్దిగా నెయ్యి వేసి బియ్యపు పిండి, ఉప్పు,కాస్త పంచదార వేసి ఒక కప్పు బియ్యపు పిండికి రెండు కప్పుల నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలాగే స్టవ్ మీద పెట్టి చిన్న మంటపై బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన బియ్యపు పిండి వేరే గిన్నెలో వేసి కొంత భాగం చిన్న చిన్న ఉండ్రాళ్లు చేసుకోవాలి.

మరోవైపు తురిమిన బెల్లం వేసి మూడు కప్పులు నీరు వేసి బాగా మరిగించాలి. ఇందులోకి ముందుగా నానబెట్టిన సెనగపప్పు వేయాలి. శనగపప్పు ఉడికిన తర్వాత ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు, వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం కొద్దిగా తీసి పెట్టుకున్న ఉండ్రాళ్ళ పిండిని పాలల్లో కలిపి వాటిని కూడా బెల్లం పాకలోకి వేసి మరిగించాలి.ఇలా ఐదు నిమిషాల పాటు చిన్న మంటపై పెట్టి దించేముందు కొబ్బరి ముక్కలు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేస్తే ఎంతో రుచికరమైన ఉండ్రాళ్ళ పాయసం తయారైనట్లే.

click me!