గణేష్ చతుర్థి 2022: వినాయక పూజ లో చేయాల్సినవీ, చేయకూడనివి ఇవే..!

By telugu news team  |  First Published Aug 26, 2022, 12:23 PM IST

పెద్ద, చిన్నా లాంటి తేడాలు లేకుండా.. వీధి వీధికీ వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి అందరూ ఆనందంగా ఈ పండగను జరుపుకుంటారు.


భారతదేశం నలుమూలలా అందరూ జరుపుకునే పండగల్లో ప్రధానంగా గణేష్ చతుర్థి ఒకటి. కుల, పెద్ద, చిన్నా లాంటి తేడాలు లేకుండా.. వీధి వీధికీ వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి అందరూ ఆనందంగా ఈ పండగను జరుపుకుంటారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఇది భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వస్తుంది. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం, గణేశ చతుర్థి ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో జరుపుకుంటారు. గణేశోత్సవ్ అని కూడా పిలుచుకునే ఈ గణేష్ చతుర్థి ని మనం పది రోజుల పాటు జరుపుకుంటాం. గణేష్ విసర్జన్ పండుగ చివరి రోజు. ఈ సంవత్సరం, గణేష్ చతుర్థి ఆగస్టు 31  రాగా..  గణేష్ విసర్జన్ సెప్టెంబర్ 9 న వచ్చింది.

Latest Videos

undefined

గణేష్ చతుర్థి 2022: ఆగస్టు 31, 2022 (బుధవారం)
మధ్యాహ్న గణేశ పూజ ముహూర్తం: ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 01:39 వరకు
వ్యవధి: 2 గంటలు 33 నిమిషాలు
చతుర్థి తిథి ప్రారంభం: ఆగస్టు 30, 2022న మధ్యాహ్నం 3:33
చతుర్థి తిథి ముగుస్తుంది: ఆగస్టు 31, 2022న మధ్యాహ్నం 03:22
గణేష్ విసర్జన్: సెప్టెంబర్ 9, 2022 (శుక్రవారం)

ఈ గణేషునికి పూజ చేసే సమయంలో చేయాల్సినవి ఏంటో... చేయకూడనివి ఏంటో తెలుసుకుందాం..

చేయాల్సినవి..
1.గణేష్ చతుర్థి రోజున మండపాల్లో వినాయకుడిని ఉంచడంతో పాటు.. ఇంట్లోని ఓ బుజ్జి గణపయ్యను పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. అయితే.. పూజ చేసిన వినాయక విగ్రహాన్ని ఇంట్లో 1.5రోజులు లేదంటే... 3 రోజులు, 7 రోజులు లేదంటే 10 రోజులు ఉంచుకొవాలి. ఉంచిన అన్ని రోజులు కచ్చితంగా పూజ చేయాలి. తర్వాత నిమజ్జనం చేయాలి.

2.వినాయకుని విగ్రహాన్ని ఉంచే ప్రదేశాన్ని అందంగా అలంకరించుకోవాలి.

3. వినాయక విగ్రహాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత కచ్చితంగా స్వామి వారికి ప్రసాదం, మంచి నీరు లాంటివి ఏవైతే సమర్పించాలో.. అన్నీ సమర్పించాలట.

4. ఇంట్లో సాత్విక ఆహారాన్ని మాత్రమే వండాలి. ఆ వండిన ఆహారాన్ని ముందుగా స్వామి వారికి సమర్పించాలి. ఆ తర్వాతే భక్తులు తీసుకోవాలి.

5.వినాయక విగ్రహాన్ని సహజ రంగులు, మట్టితో చేసినవి మాత్రమే ఎంచుకోవాలి. ఇవి మాత్రమే పర్యవరణానికి హాని చేయవు. కృత్రిమ రంగులతో చేసిన వాటిని తెచ్చుకోకూడదు.

6.నిమజ్జం చేసే సమయంలో.. ఇంట్లోని చిన్ని గణపయ్యను.. ఇంట్లోనే ఏదైనా కుండలో లేదంటే... ఇంట్లోని బకెట్ నీటిలో చేయచ్చు. లేదంటే... దగ్గరలోని చెరువులో నిమజ్జనం చేయాలి.

చేయకూడనివి...
1. ఇంట్లో వినాయకుని విగ్రహం పెట్టికున్న వారు.. నిమజ్జనం చేసే వరకు.. గణపయ్యను ఇంట్లో ఒక్కడిని వదిలి వెళ్లకూడదు. ఎవరో ఒకరు ఇంట్లోనే ఉండాలి.

2.స్వామి వారిని నిమజ్జనానికి తీసుకువెళ్లేటప్పుడు.. చివర్లో ఆర్తి ఇవ్వడం మర్చిపోవద్దు. ఆర్తి ఇవ్వకుండా.. నిమజ్జనానికి తీసుకువెళ్లకూడదు.

3.స్వామి వారి విగ్రహాన్ని ఇంట్లో పెట్టినప్పుడు.. అదేవిధంగా ఇంట్లో నిమజ్జనం చేసే సమయంలో.. ఇంటి ప్రధాన ద్వారం మూసివేయకూడదు.

4. ముహూర్తం ప్రకారమే..ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని ఉంచి.. తర్వాత పూజించాలి.

5.వినాయక చవితి రోజున ముఖ్యంగా.. ఇంట్లో పూజ చేసిన సమయంలో మద్యం, మాంసం లాంటివి వండకూడదు, ముట్టకూడదు.

6. ఇంత పవిత్రమైన రోజున ఒకరిని మోసం చేయడం, చీటింగ్ చేయడం లాంటివి అస్సలు చేయకూడదు.
 

click me!