ఈ ఏడాది అక్షయ తృతీయ పెళ్లికి సరికాదు..!

By telugu news team  |  First Published Apr 13, 2023, 2:33 PM IST

ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షం తృతీయ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22 న జరుపుకుంటారు.


అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజుంతా శుభం జరుగుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 22వ తేదీన వస్తోంది. నిజానికి.. అక్షయ తృతీయ రోజు ఎలంటి ముహూర్తాలు లేనప్పటికీ పెళ్లి చేసుకోవచ్చు అని చెబుతుంటారు. అంత మంచి రోజు అని అర్థం. కానీ... ఈ ఏడాది మాత్రం ఎంతో శుభ్రప్రదమైన ఈ అక్షయ తృతీయ వివాహానికి పనికిరాదట.  ఒక గ్రహం దీనికి అడ్డు తగలడం గమనార్హం.

ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షం తృతీయ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22 న జరుపుకుంటారు.
ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం వేలాది వివాహ వేడుకలు జరుగుతాయి. ఈరోజు పెళ్లి చేసుకున్న వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారని, వారి వివాహాలు కలకాలం నిలిచిపోతాయనే నమ్మకం దీనికి ప్రధాన కారణం. మరొక కారణం ఏమిటంటే, కొన్ని పవిత్రమైన పనులను నిర్వహించడానికి నిర్దిష్ట తేదీ అందుబాటులో లేనట్లయితే, ఆ పనులు అక్షయ తృతీయ నాడు చేయవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం, అక్షయ తృతీయ రోజు 6 అద్భుతమైన శుభ యోగాల కలయిక. ఆయుష్మాన్ యోగం, సౌభాగ్య యోగం, త్రిపుష్కర యోగం, సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం, అమృత సిద్ధి యోగం ఉంటాయి.

Latest Videos

undefined

కానీ దురదృష్టవశాత్తు, ఈ సంవత్సరం అక్షయ తృతీయ నాడు పెళ్లిళ్లు జరగవు. ఎందుకంటే ఈ రోజున మాంగల్య, గురు నక్షత్రం అంశం ఈసారి స్థిరంగా ఉంటుంది.


కన్యాదానము

అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున దానధర్మాలు చేస్తే దాతకి ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. ఎందుకంటే వారు తమ మంచి పనులకు ఆశీస్సులు పొందుతారు. కాబట్టి, ఈ రోజున తండ్రి తన కుమార్తె కన్యాదానాన్ని నిర్వహిస్తాడు. ఇది ఆమె జీవితాన్ని , వివాహాన్ని చెక్కుచెదరకుండా , సంతోషంగా ఉంచుతుంది. దీనితో పాటు అక్షయ తృతీయ నాడు వివిధ రకాల ధాన్యాలను కూడా దానం చేస్తారు. ఎందుకంటే ఈ సమయంలో పండించిన గోధుమ పంటను ఇంటికి తెచ్చుకుంటారు.

జ్యోతిష్యం ఏం చెబుతోంది?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈసారి అక్షయ తృతీయ నాడు శుభ కార్యాలకు సూచికగా భావించే బృహస్పతి గ్రహం అస్తమించనుంది. ఈ కారణంగా, అక్షయ తృతీయ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు చేపట్టరు లేదా ప్రారంభించరు. బృహస్పతి మార్చి 30న అస్తమించి ఏప్రిల్ 28న ఉదయిస్తాడు.అందుకే మంగళ కార్యాలన్నీ ఈ రోజు తర్వాతే తీసుకుంటారు, అంతకు ముందు ముహూర్తం ఉండదు.

click me!