శ్రీరాముని గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

By telugu news team  |  First Published Mar 25, 2023, 2:55 PM IST

ఈ నవమి రోజున భక్తులంతా రామాలయాన్ని దర్శించుకుంటారు. జీవితంలో తమకు సరైన మార్గం చూపించమని వేడుకుంటారు. 


రామ నవమిని త్రేతా యుగం నుంచి జరుపుకుంటూ వస్తున్నారు. అయోధ్యలో రాజు దశరథుడు, రాణి కౌసల్యకు రాముడు జన్మించినందుకు గుర్తుగా జరుపుకుంటూ వస్తున్నారు. వసంత పండుగ, ఇది చైత్ర మాసం తొమ్మిదవ రోజున ఈ పండగను జరుపుకుంటారు - హిందూ చాంద్రమాన క్యాలెండర్‌లో మొదటి నెల. చైత్ర నవరాత్రుల తొమ్మిది రోజుల తర్వాత, దుర్గాదేవి  తొమ్మిది రూపాలను పూజిస్తారు. ఆ రోజున  రాముడు, అతని ముగ్గురు సోదరులు - లక్ష్మణ్, భరత్, శత్రుఘ్నులు  భూమిపై అవతరించారు. ఈ నవమి రోజున భక్తులంతా రామాలయాన్ని దర్శించుకుంటారు. జీవితంలో తమకు సరైన మార్గం చూపించమని వేడుకుంటారు. రాముడిని మర్యాద పురుషోత్తం అని కూడా పిలుస్సతారు.

“మర్యాద పురుషోత్తం” అనే పదానికి అనేక అర్థాలున్నాయి. "మర్యాద" అంటే "మంచి ప్రవర్తన" అని అర్థం."పురుషోత్తం" అంటే పురుషులలో అసమానమైనది. ఆ విధంగా, రామ్ తన జీవితమంతా "మర్యాద"కు కట్టుబడి ఉన్నందున, అతను పురుషులందరిలో అత్యుత్తమ వ్యక్తిగా ఉంటాడు.

Latest Videos

undefined

 


రాముడు శుక్ల పక్షం నవమి తిథి నాడు చైత్ర మాసంలో మధ్యాహ్న సమయంలో జన్మించాడు. సాధారణంగా, ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి-ఏప్రిల్‌లో వస్తుంది. ఈ ఏడాది మార్చి 30న రామ నవమి వస్తుంది.

శ్రీరాముడు విష్ణు మూర్తి ఏడవ అవతారం. అతను తన ప్రజల కోసం సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాడు. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచాడు. అతను దురాశ, ద్వేషం, దుర్గుణాలకు దూరంగా ఉన్నాడు. బలహీనులను రక్షించాడు. శత్రువు ఎంత బలవంతుడైనా ఎదురించి నిలపడ్డాడు. అందుకే నేటికీ రామ రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటూ ఉంటారు.
భక్తులు ఈ రోజున శాంతి, సంపద , విజయం కోసం ప్రార్థిస్తారు. శ్రీరాముని ఆశీస్సులను కోరుకుంటారు. ఈ రోజున, చాలా మంది ప్రజలు కన్యా పూజ కూడా చేస్తారు, ఇందులో దుర్గాదేవి  తొమ్మిది రూపాలను సూచించే తొమ్మిది మంది అమ్మాయిలను పూజిస్తారు.


కొంతమంది భక్తులు స్నానం చేసి, చిన్న రాముడి విగ్రహాలను అలంకరించి, ముందు దీపం వెలిగించి, ఆపై దేవునికి నైవేద్యంగా ఖీర్ తయారు చేస్తున్నప్పుడు అతని జన్మ జ్ఞాపకార్థం వాటిని ఊయలలో ఉంచుతారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే.. శ్రీరాముని కళ్యాణం జరుగుతుంది. రాముడు జన్మించినదీ, ఆయన పట్టాభిషేకం చేసిందీ, సీతను వివాహం చేసుకుంది.. ఈ మూడు నవమి రోజు రావడంతో... ఈ రామ నవమి రోజున పలు ఆలయాల్లో ఆయన కళ్యాణం నిర్వహిస్తారు.
 

click me!