ఇదే కర్పూరంతో మన ఇంట్లో సులభంగా లభించే మూడు వస్తువులను కాల్చడం వల్ల ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయట. మరి వేటిని కాల్చాలి..? వేటిని కాల్చితే.. డబ్బు సమస్యలు తీరి.. సంపద పెరుగుతుందో చూద్దాం...
ఇంట్లో ఆర్థిక సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉండి ఉంటారు. కొందరికి అయితే... ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా.. చేతిలో డబ్బు నిలవదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అలాంటివారు కర్పూరంతో ఆ సమస్యలన్నింటి నుంచి బయటపడొచ్చంటే మీరు నమ్ముతారా..? మీరు చదివింది నిజం. కర్పూరాన్ని మనం ఎక్కుగా పూజా సమయంలో ఉపయోగిస్తూ ఉంటాం. పూజలతో సంబంధం లేకుండా.. ఇంట్లో మామూలుగా కర్పూరం వెలిగించడం వల్ల.. ఆ ఇంట్లో సంతోషం నెలకొంటుందని, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అని చెబుతూ ఉంటారు.
ఇదే కర్పూరంతో మన ఇంట్లో సులభంగా లభించే మూడు వస్తువులను కాల్చడం వల్ల ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయట. మరి వేటిని కాల్చాలి..? వేటిని కాల్చితే.. డబ్బు సమస్యలు తీరి.. సంపద పెరుగుతుందో చూద్దాం...
దాదాపు అందరు ఇంట్లో లవంగాలు ఉంటాయి. ఈ లవంగాలను రాత్రిపూట కర్పూరంతో కలిపి కాల్చాలి. ఈ రెండింటినీ కలిపి కాల్చడం వల్ల.... ఇంట్లో ఉన్న గాలి శుద్ధి అవుతుంది. ఇది ప్రతికూల శక్తిని తొలగించడంలోనూ సహాయపడుతుంది. కర్పూరం వాసన... ఇంట్లోని వారి మనసు, శరీరంపై కూడా మంచి ప్రభావం కలిగిస్తుంది. ఈ రెండూ కలిపి కాల్చడం వల్ల... ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలున్నా తొలగిపోతాయట. అంతేకాదు.. లవంగం, కర్పూరం కలిపి కాల్చడం వల్ల.... మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైనా ఆగిపోతే.. అది మీకు చేరుతుంది. అంతేకాకుండా.. ఇంట్లో ఖర్చులు కూడా తగ్గుతాయి. రోజూ సాయంత్రం ఒక పాత్రలో కర్పూరంతో పాటు 5 లవంగాలు వేసి కాల్చాలి. డబ్బు సమస్యలతో పాటు.. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
ఇక బిర్యానీ ఆకును.. కర్పూరంతో కలిపి కాల్చితే... వాతావరణం మొత్తం చాలా పవిత్రంగా మారిన అనుభూతి కలుగుతుంది. మీకు ఏవైనా తీరని సమస్యలు ఉంటే... ఆ సమస్యలను బిర్యానీ ఆకుమీద రాసి.. కర్పూరంతో కాల్చితే సరిపోతుంది. ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయి. 5 బిర్యానీ ఆకులను కర్పూరంతో కలిపి కాల్చండి.. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా డబ్బు సమస్యలు తీరతాయి.
దాల్చిన చెక్క కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. కర్పూరంతో దాల్చిన చెక్కను కలిపి కాల్చాలి. ఇలా చేయడం వల్ల.. కూడా మీకు ఉన్న ఎలాంటి ఆర్థిక సమస్యలైనా తీరిపోతాయి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుంది.