Relationship Psychology: పదే పదే తప్పుడు వ్యక్తులనే సెలెక్ట్ చేసుకుంటున్నారా? కారణం ఇదే!

Published : Apr 03, 2026, 02:40 PM IST
Relationship

సారాంశం

సాధారణంగా కొత్త రిలేషన్‌షిప్‌లోకి వెళ్లేటప్పుడు చాలామంది 'ఈసారైనా కరెక్ట్ పర్సన్ దొరికారు' అనుకుంటారు. కానీ చివరికి మళ్లీ అదే బాధ, గొడవలు, కన్నీళ్లు ఎదురవుతుంటాయి. మీ ప్రేమ కథలో కూడా ఇలాగే జరుగుతోందా? కారణం ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

Relationship Psychology: చాలామంది జీవితాల్లో కొత్త బంధం మొదట్లో అద్భుతంగా అనిపిస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ పాత కథే రిపీట్ అవుతుంటుంది. భాగస్వామి ప్రవర్తనలో మార్పు, అర్థం చేసుకోకపోవడం, చివరికి మనస్పర్థలతో ఆ బంధం ముగిసిపోవడం వంటివి జరుగుతుంటాయి. మీ జీవితంలో కూడా ఇలా పదే పదే జరుగుతుంటే, అది మీ దురదృష్టం కాదు. మీ మనస్తత్వం, చిన్ననాటి అనుభవాలే కారణమంటున్నారు సైకాలజీ నిపుణులు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

తప్పుడు వ్యక్తిని ఎంచుకోవడానికి కారణాలు

సైకాలజీ ప్రకారం చిన్నప్పుడు ఇంట్లో చూసిన వాతావరణమే మన భవిష్యత్ సంబంధాలకు బ్లూప్రింట్ లాంటిది. తల్లిదండ్రుల మధ్య ప్రేమ, గౌరవం చూస్తూ పెరిగిన పిల్లలు.. పెద్దయ్యాక తమ భాగస్వామిలో అవే గుణాలను వెతుకుతారు. కానీ, చిన్నప్పుడు గొడవలు, ప్రేమ లేని వాతావరణంలో పెరిగినవాళ్లు, తెలియకుండానే అలాంటి క్లిష్టమైన బంధాల వైపే ఆకర్షితులవుతారు.

నిపుణుల ప్రకారం మన మనసు ఎప్పుడూ తనకు పరిచయమైన భావోద్వేగాలనే వెతుకుతుంది. ఒకవేళ మీరు చిన్నప్పుడు ఇంట్లో గొడవలు, అరుపులు, ప్రేమ లోపం చూసి పెరిగితే.. మీ మెదడుకు అలాంటి అశాంతి వాతావరణమే నార్మల్ అనిపిస్తుంది. అందుకే పెద్దయ్యాక ఎవరైనా మిమ్మల్ని ప్రేమగా, గౌరవంగా చూసుకుంటే అది బోరింగ్ గా కూడా అనిపించవచ్చు. తెలియకుండానే మీ మనసు పాత గాయాన్ని గుర్తుచేసే కోపిష్టి, ఎమోషన్స్ లేని వ్యక్తుల వైపే మిమ్మల్ని లాగుతుంది.

నిజానికి చాలా సార్లు మన మీద మనకే నమ్మకం ఉండదు. నాకు నిజమైన ప్రేమకు, గౌరవానికి అర్హత ఉందా అనే తప్పుడు భావన మనల్ని వెంటాడుతుంది. దానివల్ల మనల్ని సరిగ్గా చూసుకోని వాళ్లను కూడా భరించాల్సి వస్తుంది. ఇది ఒక విష వలయం లాంటిది. ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వల్ల చెడు బంధంలోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

ఈ విష వలయం నుంచి బయటపడాలంటే, ముందు పాత సంబంధాలను విశ్లేషించుకోవాలి. మీరు ఎలాంటి వాళ్లను ఎంచుకుంటున్నారు, ఏ తప్పులు రిపీట్ అవుతున్నాయో గుర్తించాలి. అవసరమైతే స్నేహితులు లేదా సైకాలజిస్టుల సహాయం తీసుకోవాలి. అన్నింటికంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించడం, గౌరవించడం నేర్చుకున్నప్పుడే.. సరైన భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంటుందని సైకాలజీ నిపుణులు సూచిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sudha Murty Tips : ఈ టైమ్ లో భర్తను ఏదడిగినా కాదనరు..: భార్యలకు సుధామూర్తి చిట్కాలు
Relationship Tips: రిలేషన్ షిప్‌లో ఈ 3 తప్పులు చేశారంటే.. బంధం తెగిపోవడం ఖాయం!