ప్రజ్ఞానంద నుంచి పిల్లలు నేర్చుకోవాల్సినవి ఇవే..!

By telugu news team  |  First Published Aug 25, 2023, 2:08 PM IST

ప్రజ్ఞానంద తన ఆట మొదలుపెట్టడానికి ముందు దేవుడికి దండం పెట్టుకుంటాడట. దేవుడికి దండం పెట్టుకున్న తర్వాతే తన ఫస్ట్ మూవ్ చేస్తాడట.



ఫిడే చెస్ ప్రపంచకప్ ఛాంపియన్‌గా మాగ్నస్ కార్ల్‌సన్ అవతరించారు. భారత ఆటగాడు ప్రజ్ఞానందతో జరిగిన ఫైనల్‌లో కార్ల్‌సన్ విజేతగా నిలిచాడు. చివరిలో ప్రజ్ఞానంద ఒత్తిడికి గురికావడంతో రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా సరే, ప్రజ్ఞానంద సాధించింది తక్కువేమీ కాదు. ఫైనల్ దాకా చేరుకోవడం అనేది మాబత్రం మామూలు విషయం కాదు.

ప్రజ్ఞానంద నుంచి పిల్లలు అందరూ కచ్చితంగా కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిందే. ప్రజ్ఞానంద ఇతర విషయాలకు డైవర్ట్ అవ్వకుండా ఉండేందుకు బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తూ ఉంటాడట.

Latest Videos

అంతేకాకుండా, ప్రజ్ఞానంద తన ఆట మొదలుపెట్టడానికి ముందు దేవుడికి దండం పెట్టుకుంటాడట. దేవుడికి దండం పెట్టుకున్న తర్వాతే తన ఫస్ట్ మూవ్ చేస్తాడట.

ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు టీవీలు చూస్తూ టైమ పాస్ చేస్తూ ఉంటారు. కానీ, ప్రజ్ఞానంద అసలు టీవీ చూడడట.టీవీలో సినిమాలు, ప్రోగ్రాంలు లాంటివి అస్సలు చూడరట. తన సోదరితో కలిసి రోజులో 5 నుంచి 6 గంటల పాటు చెస్ ఆడుతూ ఉంటారట.

ఇక, ఫుడ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకుంటారు. బయటి ఆహారం పొరపాటున కూడా తినరట.

ప్రజ్ఞానంద కేవలం చెస్ మాత్రమే కాదు, ఇతర గేమ్స్ కూడా ఆడుతూ ఉంటాడట. ఇతర గేమ్స్ గురించి తన సోదరితో కలిసి డిస్కస్ చేస్తూ ఉంటాడట.ఆటలో కూడా తాను ఏ సమయంలో ఎలాంటి మూవ్ తీసుకుంటే మంచిదో అలాంటిదే తీసుకుంటాడట. అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోడట.

click me!