టీటీడీ ప్రత్యేక అహ్వానితుల్లో శేఖర్ రెడ్డి: జగన్ సెల్ఫ్ గోల్

By telugu teamFirst Published Sep 20, 2019, 4:01 PM IST
Highlights

టీటీడీ ప్రత్యేక ఆహ్వానితు జాబితాలో శేఖర్ రెడ్డి పేరు చోటు చేసుకుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై వైఎస్సార్ కాంగ్రెసు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ స్థితిలో జగన్ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అస్త్రంగా మారే విధంగా కనపడుతుంది. తాజాగా విడుదలచేసిన టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో తమిళనాడుకు చెందిన వివాదాస్పద ఎజె శేఖర్ రెడ్డి పేరు కూడా ఉంది. శేఖర్ రెడ్డిని గురించి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని వివరణ కోరగా, ఆదాయపు పన్ను కేసులనుంచి అతనికి క్లీన్ చిట్ లభించింది కాబట్టి బోర్డులోకి ఆహ్వానించినట్టు తెలిపారు. 

కేసులు తొలిగిపోయాయి కాబట్టి తీసుకున్నారు. బాగానే ఉంది. శేఖర్ రెడ్డిపైన గతంలో వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. గతంలో ఇతను చంద్రబాబు హయాంలో కూడా టీటీడీ బోర్డు మెంబర్ గా వ్యవహరించాడు. పెద్ద నోట్లు రద్దయినప్పుడు  ఇతడు పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ నోట్లతో పట్టుబడ్డాడు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఇదే శేఖర్ రెడ్డిపైన తీవ్ర ఆరోపణలు చేసింది. 

శేఖర్ రెడ్డి లోకేష్ బినామీ అని ఆక్షేపించింది.ఆ దొరికిన డబ్బు లోకేష్ కు చెందిన డబ్బని పేర్కొంది.  అంతేకాకుండా టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమింపబడటానికి చంద్రబాబుకు 100 కోట్లు ముట్టచెప్పాడని కూడా ఆరోపించింది. 

 ఇప్పుడు ఇలాంటి శేఖర్ రెడ్డి ని వైసీపీ తిరిగి టీటీడీ లోకి ఆహ్వానించడం పట్ల టీడీపీ నాయకులు ఇప్పటికే వైసీపీ నేతల నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆరోపించినట్టు శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యత్వం కోసం మాకు 100 కోట్లు ఇస్తే, మరి మీకెంత ఇచ్చాడు? అని ప్రశ్నిస్తున్నారు. 

ఏది ఏమైనప్పటికి, వైసీపీ చేసే ఆరోపణలు నిరాధారమైనవి అని టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్నిస్తోంది. దీనిపైన ఇప్పుడు వైసీపీ ఎం చేయలేని పరిస్థితుల్లో ఇరక్కపోయింది. ఒకవేళ శేఖర్ రెడ్డిని సమర్థిస్తే టీడీపీ మీద చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అని ఒప్పుకున్నట్టు అవుతుంది. లేదంటే తాము కూడా టీడీపీ మాదిరే డబ్బు తీసుకొని శేఖర్ రెడ్డికి చోటు కల్పించామని ఒప్పుకున్నట్టు అవుతుంది. 

మొత్తంగా ఈ విషయంలో ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది వైసీపీ పరిస్థితి.

సంబంధిత వార్తలు  

టీటీడీ బోర్డులో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు: ఉత్తర్వులు జారీ

28 మందితో టీటీడీ కొత్త పాలకమండలి: సభ్యులు వీరే

సుబ్రహ్మణ్యస్వామి పిల్ తోనే విముక్తి, ఈవో బాధ వర్ణనాతీతం :టీటీడీపై ఐవైఆర్

టీటీడీ బోర్డు మెంబర్ రేసులో లేను: స్పష్టం చేసిన ద్వారంపూడి

టీటీడీ పాలకమండలిపై జగన్ కసరత్తు: పరిశీలనలో కేసీఆర్ మిత్రుడు

click me!