ఎస్ఈసీ రమేష్ కుమార్ లేఖ: వైఎస్ జగన్ కు కేంద్రం ఝలక్

By Sree S  |  First Published Mar 20, 2020, 2:15 PM IST

పరిస్థితులన్నీ ఇలా కొనసాగుతుండగా అనూహ్యంగా తనకు రక్షణ కల్పించమని రమేష్ కుమార్ కేంద్ర హోమ్ శాఖకు రాసిన లేఖ అంటూ ఒక లేఖ బయటకు వచ్చింది. తనపై తన కుటుంబంపై దాడులు జరిగే ఆస్కారముందంటూ... అందుకు తనకు తన కుటుంబ సభ్యులకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని అందులో పేర్కొన్నారు. 


ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే! ఎన్నికల సంఘం ఇలా వాయిదా వేయడం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసియాన్ విషయం తెలిసిందే. 

ఆయన గవర్నర్ ని కలిసి ఎన్నికల ప్రధానాధికారిపై ఫిర్యాదు చేయడమే కాకుండా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. 

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ కూడా ఆయనకు ఒక లేఖను రాసారు. ఆ లేఖకు ఆయన కూడా చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ఈ పరిస్థితులు ఇలా జరుగుతుండగానే ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. 

Also read: ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం

జగన్ సర్కార్ ఆయనపై ఫిర్యాదు చేస్తూ, ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతూ..... ఎన్నికలను తక్షణం నిర్వహించమని కోరుతూ సుప్రీంకోర్టుకెక్కింది ఏపీ సర్కార్. అక్కడ వారికి చుక్కెదురైంది. 

ఈ పరిస్థితులన్నీ ఇలా కొనసాగుతుండగా అనూహ్యంగా తనకు రక్షణ కల్పించమని రమేష్ కుమార్ కేంద్ర హోమ్ శాఖకు రాసిన లేఖ అంటూ ఒక లేఖ బయటకు వచ్చింది. తనపై తన కుటుంబంపై దాడులు జరిగే ఆస్కారముందంటూ... అందుకు తనకు తన కుటుంబ సభ్యులకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని అందులో పేర్కొన్నారు. 

ఈ లేఖ ఆయనే రాశారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ లేఖను ఎవరో రాసారు, ఆయన కాదు అని ఫిర్యాదు చేయడానికి కొంతమంది వైసీపీ నేతలు డీజీపీని కూడా కలిశారు.

ఎవరు రాసారు అనే చర్చలు జరుగుతుండగా రమేష్ కుమార్ మాత్రం అందుబాటులో లేకుండా పోయారు. ఆయన హైదరాబాద్ లో తన ఇంట్లో ఉన్నారు. ఎన్నిసార్లు ఆయనను కాంటాక్ట్ చేయడానికి  వీలవలేదు. 

Also read: ఏపీ ఎస్‌ఈసీ రమేష్ కుమార్ లేఖ అందింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుండగానే.... రెండు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పోయారిణామాలను చూస్తుంటే... కేంద్రంలోని బీజేపీ సర్కార్ జగన్ ని టార్గెట్ చేసిందా అనే అనుమానం మాత్రం కలుగక మానదు. 

మొదటగా ఆర్టీఐ కింద రమేష్ కుమార్ రాసిన లేఖ హోమ్ శాఖకు అందిందా అని ప్రశ్నించగా కేవలం 18 గంటల్లోనే అవును అందింది అని రిప్లై వచ్చింది. ఇలా 18 గంటల్లో ఆర్టీఐ కి సమాధానం రావడం అందునా కేంద్ర హోమ్ శాఖ, ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశంలో రిప్లై రావడం ఆశ్చర్యకరం.  దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల మధ్య కూడా ఇలా రిప్లై రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఇలా రిప్లై వచ్చి ఇదంతా జరుగుతున్న తరుణంలోనే కేంద్ర బలగాలు రమేష్ కుమార్ ఆఫీస్ ముందు ఆంధ్రప్రదేశ్ లో సెక్యూరిటీ బాధ్యతలను కూడా తీసుకున్నాయి. ఆ తరువాత కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా తమకు రమేష్ కుమార్ లేఖ అందిందని, అధికారికి అడిగినప్పుడు బాధ్యత కల్పించడం అవసరమని అన్నారు. 

ఈ అన్ని పరిణామాలను బట్టి చూస్తుంటే... జగన్ వైఖరిని చూసి కేంద్రప్రభుత్వం ఒకింత అసహనానికి గురయినట్టుగా అర్థమవుతుంది. పాపం పరిమల్ నత్వాని కి ఇచ్చిన రాజ్యసభ సీటు కూడా  వచ్చినట్టు లేదు. 

click me!