కమల్ నాథ్ అవుట్: ఎంపీ లోనూ కర్ణాటక ఫార్ములా, లెక్కలు ఇవీ!

By Sree S  |  First Published Mar 10, 2020, 11:50 AM IST

ఉదయం అమిత్ షాతో కలిసి ప్రధానిని కలిసేందుకు వచ్చారు సింధియా. మరో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయం తెలియవస్తుంది. 


మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. ఎప్పటినుండో కూడా తనకు తగిన గుర్తింపులేదని తీవ్ర అసంతృప్తికి గురవుతున్న జ్యోతిరాదిత్య సింధియా తన వర్గానికి చెందిన ఆరుగురు మంత్రులతోసహా 17మంది ఎమ్మెల్యేలను తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్లారు. 

నేటి ఉదయం అమిత్ షాతో కలిసి ప్రధానిని కలిసేందుకు వచ్చారు సింధియా. మరో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయం తెలియవస్తుంది. 

Latest Videos

undefined

తన కుటుంబం కొన్నెండ్లుగా గెలుస్తూ వస్తున్న గుణ పార్లమెంటు స్థానాన్ని జ్యోతిరాదిత్య సింధియా అనూహ్యంగా ఓటమి చెందారు. 2019 ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జ్యోతిరాదిత్య సింధియా చాలా తీవ్రంగా కష్టపడ్డారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో సింధియా పాత్ర కాదనలేనిది. 

Also read: పతనం అంచులో కమల్నాథ్ ప్రభుత్వం: ప్రధానితో సింథియా భేటీ

అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీపడ్డారు. ఆయన అప్పట్లో అసంతృప్తిగా ఉన్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల కోసం కష్టపడాలని రాహుల్ గాంధీ చెప్పడంతో ఆయన ఒకింత తగ్గి పార్లమెంటు ఎన్నికలకోసం పని చేయడం ప్రారంభించారు. 

కానీ అనూహ్యంగా ఘోరంగా ఓడిపోవడంతో ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. తాజాగా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభ సీటు విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. 

మధ్యప్రదేశ్ లో ఇప్పటికే కమల్ నాథ్ ప్రభుత్వం స్వల్ప మెజారిటీతో ఉంది. కర్ణాటకలో మాదిరే ఇక్కడ కూడా ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయాలనీ బీజేపీ యోచిస్తోంది. దానిని విజయవంతంగా పూర్తి చేసింది కూడా. 

అచ్చం కర్ణాటక లాగే అక్కడ కమల...ఇక్కడ హోలీ అంతే తేడా!

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 230. ఇద్దరు సభ్యుల మరణం వల్ల సంఖ్యా 228 గా ఉంది. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా వర్గం నుంచి 17 మంది సభ్యులు ఉన్నారు. వారు రాజీనామాలు చేస్తే... సంఖ్యా 211 కు పడిపోతుంది.

అప్పుడు అసెంబ్లీలో మెజారిటీ మార్కు 106 కు పడిపోతుంది. బీజేపీకి సొంతగానే 107 మంది సభ్యులు ఉన్నారు. దానితో బీజేపీ స్వతహాగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 

Also read: కర్ణాటక క్రైసిస్:ఇక్కడ ఇది కొత్తేం కాదు

గతంలో కర్ణాటకలోనూ ఇదే తరహా లో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

మరి జ్యోతిరాదిత్య కు ఏమిస్తారు?

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి సహకారం అందించిన జ్యోతిరాదిత్య సింధియాను రాజ్యసభకు పంపనున్నట్టు తెలుస్తుంది. ఆయనకు రాజ్యసభ బెర్తును ఇవ్వడంతోపాటు త్వరలోనే చోటు చేసుకునే మోడీ కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని తెలుస్తుంది. 

రాష్ట్ర రాజకీయాల్లో జ్యోతిరాదిత్య సింధియాకు ఎటువంటి పాత్రను ఇవ్వకుండా జాగ్రత్తపడ్తున్నట్టుగా కనబడుతుంది బీజేపీ. ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని ఇక్కడ శివరాజ్ పాటిల్ నే ఉంచాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. 

click me!