పాకిస్తాన్ లో మైనార్టీల ఊచకోత: మన్మోహన్ సింగ్ కు భారత పౌరసత్వం ఎలా వచ్చిందో తెలుసా...?

Published : Jan 04, 2020, 03:10 PM IST
పాకిస్తాన్ లో మైనార్టీల ఊచకోత: మన్మోహన్ సింగ్ కు భారత పౌరసత్వం ఎలా వచ్చిందో తెలుసా...?

సారాంశం

పౌరసత్వ సవరణ చట్టం కేవలం ఇప్పటికిప్పుడు ఏదో తెచ్చింది కాదు. విభజనానంతరం నుంచి కొన్ని దశాబ్దాలుగా నెలకొని ఉన్న సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ పౌరసత్వ చట్టం ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. 

రాజీవ్ చంద్ర శేఖర్ 

పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.  ప్రజలను వారు తప్పుదోవ పట్టిస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియపరచడం లేదు. ఈ చట్టంపై సమగ్ర అవగాహన రావాలంటే గతంలో భారత్, పాక్ ల మధ్య జరిగిన నెహ్రు లియాఖత్ ఒప్పందంతో పాటు ఇరు దేశాల చరిత్రను, అక్కడి వాస్తవిక సామాజిక పరిస్థితులను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. 

ఈ పౌరసత్వ సవరణ చట్టం కేవలం ఇప్పటికిప్పుడు ఏదో తెచ్చింది కాదు. విభజనానంతరం నుంచి కొన్ని దశాబ్దాలుగా నెలకొని ఉన్న సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ పౌరసత్వ చట్టం ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. 

Also read; మంగళూరు హింస పథకం ప్రకారం చేసిందే...సీసీటీవీల్లో విస్తుపోయే విషయాలు

1950ల్లోనే భారత దేశం, పాకిస్థాన్ లు వారి వారి దేశాల్లోని మైనారిటీల గురించి ఆలోచించి అప్పట్లోనే ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. దాన్నే మనం నెహ్రు లియాఖత్ ప్యాక్ట్ అంటుంటాము.

భారతదేశం దేశంలో ఉన్న పౌరులందరికీ మతం అనే ఊసే లేకుండా అందరికి సమన హక్కులను ఇచ్చింది. మరోపక్క పాకిస్థాన్ ఏమో మతపరమైన మైనారిటీలకు పూర్తి హక్కులను ఇవ్వకుండా వారిని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా పరిగణించింది. (దీని మీద ఇంకా పూర్తి సమాచారం కావాలంటే క్రిస్టోఫర్ జాఫర్లొట్ పుస్తకం చదవొచ్చు)

పాకిస్థాన్ లో మైనార్టీలపైన దాడులు యథేచ్ఛగా కొనసాగుతుండేవి, కొనసాగుతున్నాయి కూడా. ఆసియ బిబి, సల్మాన్ తసీర్ ఉదంతాలు ఒక రెండు ఉదాహరణలు మాత్రమే. అలాంటివి అక్కడ నిత్యకృత్యాలు. కేవలం హిందువులే కాదు క్రిస్టియన్స్ అందరి పరిస్థితి కూడా ఇదే. 

20వ శతాబ్దం అంతా కూడా పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్ధులందరికీ కూడా ఆటోమేటిక్ గా పౌరసత్వం ఇస్తూ వచ్చింది భారతదేశం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారతీయ పౌరుడు అయ్యింది కూడా ఇలానే! నెహ్రు లియాఖత్ ఒప్పందంలో భారతదేశంలోని హిందువుల గురించి కానీ, పాకిస్థాన్ లోని ముస్లిమ్స్ గురించి గాని ఎక్కడా చర్చించలేదు. 

భారతదేశంలో రాజకీయ శరణార్థులకు మతాలకు అతీతంగా పౌరసత్వం జారీ చేస్తున్నాము. కాకపోతే దాని విధానం వేరు. భారత దేశం ఒక లౌకిక దేశం. కానీ పాకిస్థాన్ అలాకాదు. నేటికీ అక్కడ మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ లో గురుద్వారా మీద జరిగిన దాడే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 

(రచయిత బీజేపీ రాజ్యసభ ఎంపీ, వ్యాపారవేత్త)

PREV
click me!

Recommended Stories

S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?