కవిత భవిష్యత్తుపై కేసీఆర్ ప్లాన్ ఇదీ: శరద్ పవార్ ఫార్ములా

By telugu team  |  First Published Dec 16, 2019, 12:56 PM IST

2014 పార్లమెంటు ఎన్నికల్లో అత్తగారిళ్లయిన నిజామాబాదు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆమె ఒక్కరు మాత్రమే గెలవడం కాదు ఆ జిల్లాను క్లీన్ స్వీప్ చేసి కెసిఆర్ కి గిఫ్ట్ గా అందించారు కవిత. కానీ రెండో దఫాలో మాత్రం తన అత్తింట కవిత ఓడిపోయారు. అప్పటి నుంచి కవిత కోలుకున్నట్టు కనపడడం లేద


తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు కవిత. తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ నేతలు రాజీనామాలు చేసి ఎన్నికలకు పోయిన ప్రతిసారి అక్కడ ప్రచార బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసేది. 

అప్పట్లో తెలంగాణ ఉద్యమ నినాదం మహబూబ్ నగర్ జిల్లాలో బలంగా లేదని అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు అంటే...తెలంగాణ ఆకాంక్ష యావత్ తెలంగాణ అంతా ఉందని నిరూపించడానికి కెసిఆర్ అక్కడ పోటీకి దిగారు.

Latest Videos

undefined

అప్పట్లో అది సాహసమే చెప్పాలి. అక్కడ గనుక కేసీఆర్ ఓటమి చెంది ఉంటే, తెలంగాణ ఉద్యమానికి అది పెద్ద ఎదురుదెబ్బ అయి ఉండేది. ఆ ఎన్నికలో కవిత అన్నీ తానై వ్యవహరించి అక్కడ తండ్రి గెలుపులో కీలక పాత్ర పోషించింది. 

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మకు పునరుజీవనం పోయడంలో కవిత పాత్ర కీలకం. తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేయడంద్వారా తెలంగాణ అస్తిత్వ ప్రతీకలన్నిటికి కవిత ఊపిరిని ఊదారు అనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. 

తెలంగాణ నుంచి టెక్సాస్ వరకు తెలంగాణవారు ఎక్కడుంటే అక్కడ బతుకమ్మ ఉత్సవాల నిర్వహణను ప్రోత్సహిస్తూ, కుదిరితే అక్కడ ప్రత్యక్షమవుతూ ఈ బతుకమ్మ పండుగకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు.

తెలంగాణ ఏర్పడ్ద తరువాత ట్యాంక్ బండ్ పై భారీస్థాయిలో వేడుకలను నిర్వహించడం... తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. 

అలంటి కవిత ఇప్పుడు పెద్దగా కనపడడం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి కవిత బహిరంగ వేదికలపై కనపడడం లేదు. బతుకమ్మ పండుగ వేడుకలకు కూడా దూరంగా ఉన్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో కూడా బయటకు రాలేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో భారీ విజయం తరువాత ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు తప్ప బహిరంగంగా మాత్రం దర్శనమివ్వలేదు. 

Also read: కవిత ఇష్యూ: కరుణానిధి, పవార్ బాటల్లోనే కేసీఆర్

2014 పార్లమెంటు ఎన్నికల్లో అత్తగారిళ్లయిన నిజామాబాదు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆమె ఒక్కరు మాత్రమే గెలవడం కాదు ఆ జిల్లాను క్లీన్ స్వీప్ చేసి కెసిఆర్ కి గిఫ్ట్ గా అందించారు కవిత.  

కానీ రెండో దఫాలో మాత్రం తన అత్తింట కవిత ఓడిపోయారు. అప్పటి నుంచి కవిత కోలుకున్నట్టు కనపడడం లేదు. పసుపు బోర్డు విషయంలో గతంలో తెరాస ఇచ్చిన హామీని ఎన్నికలవేళ బయటకు తీసుకురావడంలో బీజేపీ సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కొద్దిమంది కవితకు వ్యతిరేకంగా పనిచేశారని టీఆర్ఎస్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. కవిత ఓటమి తర్వాత బయటకు కనిపించడం లేదు. కార్యక్రమాలకు హాజరు కావడం లేదు.

కవిత ఓటమితో నిజామాబాద్ పార్లమెంట్ లో అభివృద్ధి పడకేసిందని,  ప్రజలు మాత్రమే కాదు విపక్ష కాంగ్రెస్ కూడా బాహాటంగానే ప్రకటిస్తుంది. ఇక్కడి ప్రజలు ఘోరమైన తప్పుడు నిర్ణయం తీసుకున్నారని స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసారు. 

కవితపై ఏదో ప్రజలను బీజేపీ రెచ్చగొట్టింది అని అనేకంటే... రైతులు కూడా స్వతంత్రంగా రోడ్లపైకి వచ్చారు. తెరాస నేతల ఒత్తిడిని కూడా ఎదుర్కొని వారు నామినేషన్లు వేసి ఎన్నికల బరిలో నిలిచారు. కనుక ఇక్కడ బీజేపీపై కన్నా కూడా ప్రజలు కావాలని కవితను ఓడగొట్టారనే భావన తెరాస వర్గాల్లో వినపడుతుంది. 

ఇక కెసిఆర్ కూడా ఇదే అభిప్రాయానికి వచ్చారట. తన కూతురు కవితను ఓడించిన నిజామాబాద్ ప్రజలపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారట. అందుకే వచ్చే ఎన్నికల్లో  కవితను నిజామాబాద్ లో పోటీచేయించవద్దని నిర్ణయించినట్లు సమాచారం. 

ఎట్టిపరిస్థితుల్లోనయినా గెలవగలిగే ఒక కంచుకోటను కవితకు శాశ్వత నియోజకవర్గంగా అందివ్వాలని కెసిఆర్ వ్యూహాలు రచిస్తున్నారట. అందుకోసం కెసిఆర్ సొంత జిల్లా అయిన మెదక్ ను ఎంచుకున్నట్టు సమాచారం. 

మెదక్ ఎంపీ సీటు పరిధిలోకే సిద్దిపేట, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. స్వయానా ముఖ్యమంత్రి కెసిఆర్, హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలు.  మిగిలిన నియోజకవర్గాలు ఎలా ఉన్నా... ఈ రెండు నియోజకవర్గాల మెజారిటీ చాలు కవితను గెలిపించడానికి అని కెసిఆర్ నమ్ముతున్నారట. 

Also read: కేకే స్థానంలో రాజ్యసభకు కవిత: నాయని నర్సింహా రెడ్డికి ఝలక్?

దానికి తోడు కనుచూపు మేరలో మెదక్ జిల్లాలో తెరాస ను ఎదుర్కొనే శక్తి లేదు.. జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ద్వారా మెదక్ ను ఒక హై ప్రొఫైల్  నియోజకవర్గంగా రూపుదిద్దాలని కెసిఆర్ భావిస్తున్నారు.

హైప్రొఫైల్ నియోజికవర్గాలుగా కనుక అభివృద్ధి అయితే... అక్కడ ప్రజలకు నేత ఎప్పుడు అందుబాటులో ఉంటే, ఎంతబలమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ వారు అక్కడ ఓడిపోయే ఆస్కారమే ఉండదు. 

ఉదాహరణకు బారామతి ని తీసుకోండి. అది పావార్ల కంచుకోట. ఎంత ప్రచండమైన మోడీ పవనాలు వీచినా అక్కడ గెలిచేది పావార్లే. ఇలాంటి మరో నియోజిక వర్గం ఛింద్వారా. ఇది కమల్ నాథ్ కంచుకోట. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు.

ఈ రెండు నియోజకవర్గాల్లో ఇలా సిట్టింగులే గెలవడానికి కారణం అక్కడ చేసిన అభివృద్ధి. కాబట్టి కెసిఆర్ కూడా ఇలానే ఆలోచించి మెదక్ ను అలా చేసి కవితకు దాన్ని ఒక శాశ్వత కంచుకోటగా మార్చి కవితకు అందించాలనుకుంటున్నారు. 

అంతేకాకుండా కవిత కూడా అక్కడి నుండే పోటీకి దిగితే జిల్లాపై పూర్తి పట్టు సాధించవచ్చని, పూర్తి కుటుంబ కనుసన్నల్లోకి జిల్లా రావడం వల్ల జిల్లా అభివృద్ధి, ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టి సారించవచ్చని కూడా కెసిఆర్ భావిస్తున్నారు. 

ఈ ప్రచారమే గనుక నిజమయ్యి కవితను మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బరిలోకి దింపేందుకు కెసిఆర్ సమాయత్తమయితే... ఇంకొన్ని రోజుల్లోనే కవితను అక్కడ ఆక్టివ్ చేస్తారు. ఇదే జరిగితే నిజామాబాద్ పై ఇప్పటికే ఉన్న శీత కన్ను మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కవితను ఓడించినందుకు ఇప్పుడు నిజామాబాద్ వాసులకు కేసీఆర్ గట్టి దెబ్బ తీయబోతున్నారని గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

click me!