మనసుల్ని గెలిచిన నేతలు: మోడీ రెండోసారి, కేసీఆర్ తొలిసారి!

By Sree SFirst Published Mar 22, 2020, 7:58 PM IST
Highlights

ప్రధాని కోరినట్టుగా, ముఖ్యమంత్రి కేసీఆర్ రిక్వెస్ట్ చేసినట్టుగా ప్రజలంతా జనతా కర్ఫ్యూ లో పాల్గొనడంతోపాటుగా... సాయంత్రం తమ చప్పట్లతో సంఘీభావం తెలిపారు. నేటి సాయంత్రం ఆవిష్కృతమైన ఈ దృశ్యం నిజంగా ఒక అద్భుతమని చెప్పవచ్చు. 

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచమంతా విలవిల్లాడిపోతోంది. అన్ని దేశాలు, ప్రజలు కుల మత వర్ణ బేధాలు లేకుండా చివురుటాకుల్లా వణికిపోతున్నారు. ప్రభుత్వాలన్నీ ఇంకా మందు కూడా లేని ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ప్రజల కదలికలపై ఆంక్షలువై విధిస్తు తమ పరిధిలోని చర్యలన్నింటిని చేయగలిగినంత మేర చేస్తుంది. 

ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ నేడు జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే! జనతా కర్ఫ్యూ తోపాటుగా నేటి సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా వైద్య సేవలందిస్తున్న వారందరికీ, ప్రజల ఆరోగ్యం కోసం శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారికి థాంక్స్ చెప్పడానికి అందరిని బయటకు వచ్చి చప్పట్లతో సంఘీభావం తెలుపమని చెప్పారు. 

కొంతమంది సోషల్ మీడియాలో ప్రధానిని ఈ విషయమై ట్రోల్ కూడా చేసారు. కేసీఆర్ నిన్న సాయంత్రం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ... ఇలా ప్రధాని చప్పట్లు కొట్టమన్నది ప్రజల సంఘీభావ సూచకంగా అని, ఇలాంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు తగవని ఆయన అభిప్రాయపడ్డారు. 

Also read: కరోనా కు మందు వచ్చేస్తుందన్న ట్రంప్: వాస్తవాలు ఇవీ...!

ప్రధాని కోరినట్టుగా, ముఖ్యమంత్రి కేసీఆర్ రిక్వెస్ట్ చేసినట్టుగా ప్రజలంతా జనతా కర్ఫ్యూ లో పాల్గొనడంతోపాటుగా... సాయంత్రం తమ చప్పట్లతో సంఘీభావం తెలిపారు. నేటి సాయంత్రం ఆవిష్కృతమైన ఈ దృశ్యం నిజంగా ఒక అద్భుతమని చెప్పవచ్చు. 

ఇలా ఈ కార్యక్రమం ఇంతలా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఏదైనా ఉందంటే... అది ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా అనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. ఆయన గతంలో సీలిండర్లపై సబ్సిడీని వదులుకోమని స్వచ్చంధంగా పిలుపునిచ్చినప్పుడు... చాల మంది ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసారు. 

ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రెండవసారి ఇలా ప్రజలని కోరడం, వారు ఇంతలా రెస్పాండ్ అవడం నిజంగా గొప్ప విషయం. ఇక ప్రధాని మోడీతోపాటుగా ఇక్కడ మనం చెప్పుకోవాలిసింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి. 

తెలంగాణ ముఖ్యమంత్రి కాకముందు ఆయన చాలా సార్లు ఇలా ఉద్యమాలకు స్వచ్చంధంగా పిలుపునిచ్చి విజయవంతమయ్యారు. తెలంగాణ ఉద్యమమే అందుకు ఒక బెస్ట్ ఉదాహరణ. అందులో ఒక్కో ఘట్టమూ ఒక అపూర్వ విజయం అని అనడంలో నో డౌట్. 

ఇలా తెరాస అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి స్వచ్చంధంగా ముందుకు వచ్చి ఇలా ప్రభుత్వానికి బాసటగా నిలవడం నిజంగా గొప్ప విజయం. 

Also read: గుజరాత్ మోడల్ నే కాదు, జనతా కర్ఫ్యూని కూడా రిపీట్ చేసిన మోడీ!

ఇక్కడ కేసీఆర్ ఇమేజ్ కూడా బాగా ఉపయోగపడింది. ఆయన ప్రతిరోజు మీడియాతో మాట్లాడడం, తొలుత పారాసిటమాల్ వేస్తే పోతుందని అన్నప్పటికీ.... అది ప్రజల్లో ధైర్యం నింపేందుకు అన్న మాటలు. 

ఒక్కసారి పరిస్థితి ఇలా చేయిదాటిపోయే ప్రమాదం ఉంది, ఇటలీ లాంటి పరిస్థితి రాకూడదు అని అనుకున్నాడో... పూర్తిగా రంగంలోకి దిగారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం పరుగులు పెట్టించారు. 

ప్రజలకు ఎప్పటికప్పుడు తానే ఇన్ఫర్మేషన్ ఇస్తూ... తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. తెలంగాణలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ... ప్రజల్లో ధైర్యం నింపారు. 

ఆయన ప్రెస్ మీట్ కోసం ఇందాక ఎదురు చూస్తుంటే... సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చదువుతున్నప్పుడు కేసీఆర్ ని ప్రజలు ఎంతగా నమ్ముతున్నారా స్పష్టమయింది. కరోనా కి కరెక్ట్ మొగుడు కేసీఆర్ అని ఒకరు కామెంట్ చేసారు.  అక్కడ చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 

రాజకీయంగా కేసీఆర్ ని వ్యతిరేకించేవారయినా సరే.... కరోనా పై ఆయన తీసుకుంటున్న చర్యలపట్ల కనీసం వేలెత్తి చూపలేరు. ఆయన పదే పదే ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నారు, వారికి పరిస్థితిని అర్థమయ్యేటట్టు చెబుతున్నారు. 

కేసీఆర్ ఇమేజ్, ఆయన వాగ్ధాటి ఒకింత ప్రజలను ఆయన మాటలను వినేట్టు చేస్తే... ఆయన ప్రదర్శిస్తున్న కమిట్మెంట్ మాత్రం ప్రజలందరినీ స్వచ్చందంగా కేసీఆర్ చెప్పిన మాటను ఫాలో అయ్యేలా చేస్తున్నాయి. 

click me!