ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ కి మందు కనిపెట్టడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. వాక్సిన్ తయారీకి కనీసం ఇంకొక్క సంవత్సర కాలం పడుతుంది. ఈ నేపథ్యంలో కనీసం కొంతలో కొంత ఈ వైరస్ మహమ్మారి నుండి మనుషుల ప్రాణాలను కాపాడేలా మందును తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ.
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. మందులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో.... హెచ్ఐవి మందులను ఇతరాత్రాలను కలిపి ఇస్తున్నారు. అంతే తప్ప.. ఈ వైరస్ కి అయితే ఇప్పటికింకా మందు రాలేదు.
మనిషి రోగనిరోధక శక్తిని పెంచి ఈ వైరస్ పై పోరాటం చేయాలి కాబట్టి, హెచ్ ఐ వి కూడా ఇలానే మనిషిలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి, అలా హెచ్ఐవి మందులను ఇస్తోంది ప్రభుత్వం.
undefined
ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ కి మందు కనిపెట్టడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. వాక్సిన్ తయారీకి కనీసం ఇంకొక్క సంవత్సర కాలం పడుతుంది. ఈ నేపథ్యంలో కనీసం కొంతలో కొంత ఈ వైరస్ మహమ్మారి నుండి మనుషుల ప్రాణాలను కాపాడేలా మందును తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ.
తాజాగా నిన్న సాయంత్రం 7.30 ప్రాంతంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ మహమ్మారికి దాదాపుగా ఒక మందు దొరికినట్టే అనే భావనలో ఒక ట్వీట్ చేసారు. హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ తో పాటుగా అజిత్రోమైసిన్ మందుల కాంబినేషన్ కరోనా మహమ్మారిపై అద్భుతంగా పనిచేస్తున్నాయని అన్నారు.
HYDROXYCHLOROQUINE & AZITHROMYCIN, taken together, have a real chance to be one of the biggest game changers in the history of medicine. The FDA has moved mountains - Thank You! Hopefully they will BOTH (H works better with A, International Journal of Antimicrobial Agents).....
— Donald J. Trump (@realDonaldTrump)ఆయన ఈ ట్వీట్ చేసేకన్నా ముందు ఫ్రాన్స్ లో జరిగిన ఒక పరిశోధన కూడా ఇదే విషయాన్నీ వెలువరించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ మందులేమిటి? అవి ఎలా పని చేస్తాయనేది తెలుసుకుందాము.
హైడ్రాక్సిల్ క్లోరోక్విన్...
మలేరియాను నయం చేసేందుకు ఈ టాబ్లెట్ ను మనము వాడుతాము. మలేరియాను నయం చేయడానికే కాకుండా ఆర్తరైటిస్ నుండి కూడా ఉపశమనం కల్పించేందుకు ఈ టాబ్లెట్ ను వాడతారు. ఇప్పటికి... ఈ టాబ్లెట్ ఆర్తరైటిస్ ని ఎలా నయం చేస్తుందో తెలియదు.
కానీ ఇప్పటివరకు జరిగిన పరిశోధనల నుండి సేకరించిన సమాచారం మేరకు, మనిషిలోని రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా ఈ టాబ్లెట్ ఆర్తరైటిస్ ని నయం చేస్తుందని తెలియవస్తుంది. ఇప్పుడు ఈ టాబ్లెట్ లో ఉన్న ఈ గుణమే ఇక్కడ పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది.
మలేరియా వైరస్ వల్ల కలగకపోయినా... కరోనా కు దెగ్గర చుట్టమైన సార్స్ ను ఎదుర్కోవడంలో ఈ క్లోరోక్విన్ విజయవంతమైందని కొన్ని రీసెర్చులు ప్రకటించాయి. ఇప్పటికి పూర్తిగా అందరి ఆమోద ముద్ర మాత్రం పడలేదు.
అజిత్రోమైసిన్....
ఈ క్లోరోక్విన్ తోపాటుగా అజిత్రోమైసిన్ ని కలిపి తీసుకున్నప్పుడు కరోనా ను సమర్థవంతంగా ఎదురుకోవొచ్చునని ఇటు ఫ్రెంచ్ పరిశోధనయినా, ట్రంప్ అయినా చెప్పడం జరిగింది.
మామూలుగా అజిత్రోమైసిన్ ఒక ఆంటిబయోటిక్. దీనిని రకరకాల ట్రీటుమెంటుల్లో వాడినప్పటికీ... బ్రాంకైటీస్, న్యుమోనియా కేసుల్లోనూ ఈ మందును మనం వాడతాము. ఈ మందును ఇప్పుడు అదే న్యుమోనియా లక్షణాలు కలిగిన కరోనా ను ఎదుర్కొనేందుకు వాడుతున్నారు.
మొత్తానికి ఇంకా పూర్తిస్థాయిలో ఇవే మందులు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించకపోయినా... మహమ్మారి ఇలా విజృంబిస్తున్నవేళ కనీసం ప్రాణాలు కాపాడడానికైనా ఈ మందులను వాడాలని సదరు దేశాలు ఆలోచనలు చేస్తున్నాయి.
అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కి ఈ మందులను పరీక్షించమని పంపారు. వారు ఇంకా వీటిపై పరిశోధనలు జరుపుతున్నారు. మరికొన్ని రోజుల్లో అంటే ఒక నాలుగైదు రోజుల్లో దీనికి సంబంధించి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలియవస్తుంది.