మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ ప్రకటించిన యుద్ధంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నీళ్లు చల్లారు. Modi ప్రభుత్వంపై KCR పోరాటం పరిమితమైంది మాత్రమేనని ఎర్రబెల్లి తేల్చేశారు. ఆయన ప్రకటన చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. శుక్రవారంనాడు ధర్నాలకు కూడా పిలుపునిచ్చారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వంపై ఇక పోరు తప్పదనే రీతిలో ఆయన మాట్లాడారు. వరిధాన్యం కొనుగోలు విషయంలోనూ వ్యవసాయ చట్టాల విషయంలోనూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా లేవని తేల్చి చెప్పారు. దేశంలో పర్యాటకాభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళికలు లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
అంతేకాదు, విద్యుత్తు అవసరాలను, నీటి అవసరాలను తీర్చలడంలో పూర్తిగా గత కేంద్ర ప్రభుత్వాలతో ప్రస్తుత మోడీ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైందని KCR విమర్శించారు. ప్రణాళికలు లేకపోవడం వల్లనే ఈ రెండు రంగాల్లో ఉన్న వనరులను వాడుకోలేకపోతున్నామని, వాటిని వినియోగంలోకి తేవడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. చైనాతో దేశంతో భారతదేశాన్ని పోలుస్తూ కూడా చెప్పారు. బిజెపి మతతత్వ పార్టీ అని, మతం తప్ప మరో ఎజెండా దానికి లేదని విమర్శించారు.
undefined
ఈ స్థితిలో ఆయన కేంద్రంపై ఇక పోరాటం చేస్తాననే సంకేతాలు ఇచ్చారు. గతంలో కూడా ఆయన పలుమార్లు కేంద్రంపై, BJPపై విరుచుకుపడ్డారు. కాంగ్రెసు, బిజెపిలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పెడుతానని కూడా ఆయన ప్రకటించారు. నిజంగానే కేసీఆర్ బిజెపిపై యుద్ధం చేస్తారని అనుకునే విధంగా ఆయన మాటల జోరు ఉంది. యాసంగిలో రైతులు వరిపంట వేయకూడదని కేసీఆర్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. దీనిపై కాంగ్రెసు మాత్రమే కాకుండా రాష్ట్ర బిజెపి నేతలు కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ఫాంహౌస్ ను దున్నుతానని అన్నారు.
Also Read: 'వరి' అస్త్రం: కేంద్రంపై యుద్ధానికి కేసీఆర్ 'సై '
యాసంగిలో వరిధాన్యం వేస్తే Narendra Modi కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా, కొనుగోలు చేస్తామని కేంద్రం చేత బిజెపి రాష్ట్ర నాయకులు ప్రకటన ఇప్పిస్తారా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాల్లో తప్పిదాల వల్ల ఈ పరిస్థితి వస్తోందని ఆయన అన్నారు. రైతుల మేలు కోసం తాము వరిధాన్యం పండించవద్దని చెబుతున్నామని, ఇలా చెప్పడానికి కూడా కేంద్రమే కారణమని ఆయన అన్నారు.
హుజుర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించడంతో కేంద్రం మీద కేసీఆర్ రెచ్చిపోతున్నారనే అభిప్రాయం ఉంది. గతంలో కూడా ఇలాంటి ప్రటనలే చేసి వెనక్కి తగ్గారని అంటున్నారు. రాష్ట్రంలో బిజెపి నేతలపై విమర్శలు చేస్తూనే కేంద్రంతో సఖ్యత సాగిస్తూ ఉంటారనే అభిప్రాయం ఉంది. బిజెపి జాతీయ నేతలతో ఆయన దోస్తీ కొనసాగుతుందని, బిజెపిపై చేసే విమర్శలను నమ్మడానికి వీలు లేదని కాంగ్రెసు నాయకులు అంటున్నారు.
Also Read: బీజేపీతో గొడవపడే ఉద్ధేశ్యం లేదు.. రైతుల కోసమే కేంద్రంపై పోరాటం: ఎర్రబెల్లి
దాన్ని నిజం చేస్తూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ప్రకటన చేశారు. బిజెపితో గొడవ పడే ఉద్దేశం తమకు లేదని ఆయన అన్నారు. రైతుల కోసమే తాము కేంద్రంపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరాటం చేస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పే వరకు Modi ప్రభుత్వం పోరాటం చేస్తామని కూడా ఆయన చెప్పారు. దీంతో కేసీఆర్ బిజెపి కేంద్ర ప్రభుత్వంపై చేసే పోరాటం పరిమితమైందనేది అర్థమవుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ మాదిరిగా పూర్తిగా బిజెపి వ్యతిరేక వైఖరి తీసుకుని పోరాడే ఉద్దేశం కేసీఆర్ కు లేదని అర్థమవుతోంది. ఈ కారణంగానే Mamata Bajerjeeలాంటివాళ్లు కేసీఆర్ ను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని అంటున్నారు.