ఈ నెల 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15 వరకు వాయిదాపడడంతో క్రికెట్ అభిమానులంతా నైరాశ్యంలో కూరుకుపోయారు. అసలు ఐపీఎల్ జరుగుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఒక 15 రోజులపాటు వాయిదా వేయడం వల్ల అప్పటికి కరోనా వైరస్ పరిస్థితి ఏమిటో సమీక్షించి నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది.
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోని అన్ని క్రీడా సంగ్రామాలు అయితే వాయిదాపడతామో, లేదా పూర్తిగా కాన్సల్ అవడమే జరుగుతోంది. ఇప్పటికే ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్, సంతోష్ ట్రోఫీలు కాన్సల్ అయ్యాయి. ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడింది.
ఇక ఈ కరోనా వైరస్ దెబ్బకు భారత్ క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాల వల్ల ఐపీఎల్ ను కూడా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ ను మరో రెండు వారాలపాటు అంటే దాదాపుగా ఏప్రిల్ 15వరకు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రకటనను కూడా విడుదల చేసింది బీసీసీఐ.
ఈ నెల 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15 వరకు వాయిదాపడడంతో క్రికెట్ అభిమానులంతా నైరాశ్యంలో కూరుకుపోయారు. అసలు ఐపీఎల్ జరుగుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఒక 15 రోజులపాటు వాయిదా వేయడం వల్ల అప్పటికి కరోనా వైరస్ పరిస్థితి ఏమిటో సమీక్షించి నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది.
Also read: కరోనా దెబ్బ: ఐపీఎల్ వాయిదా...కొత్త ఆరంభ తేదీ ఇదే!
ఇక ఇలా 15 రోజులపాటు వాయిదా పడితే... షెడ్యూల్ అంతా 15 రోజులపాటు పెరిగిపోవడం వల్ల, అప్పుడు ఐపీఎల్ అంతర్జాతీయ షెడ్యూల్ మీద ప్రభావం చూపే కారణముంది కాబట్టి ఐపీఎల్ రాద్దవుతుందేమో అని క్రికెట్ ఔత్సాహికులు బాధను వ్యక్తం చేస్తున్నారు.
కాకపోతే ఇక్కడే క్రికెట్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్. కరోనా వైరస్ వల్ల ఐపీఎల్ వారం రోజులు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా నిర్ణీత తేదీకే పూర్తి చేసే ఆస్కారం కూడా లేకపోలేదు.
29 మార్చ్ నుండి ప్రారంభమవ్వాల్సిన ఐపీఎల్ మే 24 న ముంబైలోని వాంఖడేలో జరిగే ఫైనల్ తో ముగుస్తుంది. ఈ సారి ఐపీఎల్ సీజన్ చాలా ఎక్కువ రోజులు జరగనుందని అందరూ అనుకున్నారు. దానికి కారణం ఏమిటంటే.... గతంలో జరిగిన ఐపీఎల్ సీజన్లతో పోల్చితే... ఈసారి డబల్ హెడర్ మ్యాచులు లేవు.
గత సీజన్లలో శని, ఆదివారాలు రెండేసి చొప్పున మ్యాచులు జరిగేవి. సాయంత్రం 4గంటలకొకటి, రాత్రి 8 గంటలకు ఒకటి. కానీ ఈసారి శనివారాలు రోజున ఆ డబల్ హెడర్ లను పూర్తిగా తొలగించారు. అన్ని ఆదివారాల్లో కూడా అలా రెండేసి మ్యాచులు లేవు.
ఇప్పుడు ఇలా డబల్ హెడర్ లను పూర్తిగా తగ్గించేసి, ఇన్ని ఎక్కువరోజులు పాటు ఐపీఎల్ ను నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అదృష్టంగా మారింది.
Also read; వీసాల పై భారత్ ఆంక్షలు: అయినా ఐపీఎల్ ఆడడానికి విదేశీ ఆటగాళ్లు ఎలా వస్తారంటే...
15 రోజులపాటు ఐపీఎల్ ఆలస్యమయితే... 20 మ్యాచులను నష్టపోయే ఆస్కారం ఉంది(తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం). ఇప్పుడు ఈ 20 మ్యాచులను గనుక మధ్యలో ఎక్కడైనా చోటు కల్పించగలిగితే సరిపోతుంది. మనకు సీజన్లో గ్యాపులు కూడా ఉన్నందున ఆ పని తేలికగా జరిగిపోతుంది.
గత సీజన్లో మాదిరే ఈసారి కూడా డబల్ హెడర్ ల సంఖ్యను పెంచుతారు. ప్రతి శనివారంతో పాటు అవసరమనుకుంటే శుక్రవారం రోజున లేదంటే ఏదైనా హాలిడే రోజున కూడా డబల్ హెడర్ లను పెడితే సరిపోతుంది.
ఇక మరో ఆస్కారం మనకు ఆఖరు లీగ్ మ్యాచ్ కి, ఫైనల్ మ్యాచ్ కి మధ్య ఉన్న సమయంలో కూడా మూడు రోజుల గ్యాప్ దొరుకుతుంది. అక్కడ మూడు రోజుల్లో కలుపుకొని 6 మ్యాచులు నిర్వహించే వీలుంటుంది. ఇలా గనుక అడ్జస్ట్ చేసుకుంటూ పోతే... ఐపీఎల్ షెడ్యూల్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించాల్సిన అవసరం ఉండదు.
ఇతర దేశాలకు వారి వారి అంతర్జాతీయ షెడ్యూళ్లు ఉంటాయి. వాటికి అంతరాయం కలిగించకూడదు. భారత్ కి కూడా ఈ ఐపీఎల్ ముగియగానే శ్రీలంక సిరీస్ ఉంది. ఈ అన్ని విషయాలను కూడా ఐపీఎల్ నిర్వాహకులు పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది.