వీసాల పై భారత్ ఆంక్షలు: అయినా ఐపీఎల్ ఆడడానికి విదేశీ ఆటగాళ్లు ఎలా వస్తారంటే...

By Sree SFirst Published Mar 12, 2020, 4:48 PM IST
Highlights

కరోనా వైరస్ దెబ్బకి వీసా ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ భారత్ కు వచ్చే విదేశీ ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ ఆడటానికి రావొచ్చు. భారత ప్రభుత్వం ఏదో వారికి మినహాయింపు ఇచ్చిందని అనుకోకండి. మరి ఎలా వస్తున్నారు?

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ భారత ప్రభుత్వం విషయాలపై ఆంక్షలు విధించింది. డిప్లొమాటిక్ వీసాలు , ఎంప్లాయిమెంట్ వీసాలు, లేదా ప్రాజెక్ట్ వీసాలు మినహా వేరే ఏ వీసా కలిగినవారైనా సరే భారత దేశంలోకి ఏప్రిల్ 15 వరకు అడుగుపెట్టొద్దని ఇండియా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 

చూస్తేనేమో ఐపీఎల్ ఈ నెల 29 నుంచే ప్రారంభమవనుంది. రేపటి నుండి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ ఆంక్షల నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా కరోనా దెబ్బకు అసలు ఐపీఎల్ లో విదేశీ ఆటగాళ్లు ఆడుతారు లేదా అనే నిరాశలో కూరుకుపోయారు. 

కానీ ఇక్కడే క్రికెట్ అభిమానులకు తెలియని ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే... ఈ కరోనా వైరస్ దెబ్బకి వీసా ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ భారత్ కు వచ్చే విదేశీ ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ ఆడటానికి రావొచ్చు. భారత ప్రభుత్వం ఏదో వారికి మినహాయింపు ఇచ్చిందని అనుకోకండి. మరి ఎలా వస్తున్నారు?

Also read: ఐపీఎల్ పై కరోనా ఎఫెక్ట్... విదేశీ ఆటగాళ్లు లేకుండానే...

దీనికి సమాధానం తెలియాలంటే... మనం ఐపీఎల్ లో ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు మధ్య ఉండే ఒప్పందాన్ని ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. ఆ కాంట్రాక్టును గనుక పరిశీలిస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. 

ఐపీఎల్ ఆడటానికి వచ్చే విదేశీ ఆటగాళ్లకు కూడా భారత ప్రభుత్వం పాన్ కార్డులను జారీ చేస్తుంది. వారు తాము సంపాదించినా దాంట్లో పన్నులను ఇక్కడే చెల్లించి మిగితా సొమ్మును మాత్రమే వారి స్వదేశాలకు పట్టుకుపోతారు. 

వారు తొలుత కాంట్రాక్టు మీద సంతకం చేసినప్పుడు వారు కాంట్రాక్టు ఒప్పుకున్నట్టుగా పరిగణిస్తారు. అప్పుడు ఆ సదరు ఆటగాడి స్వదేశానికి ఈ ఆటగాడిని పంపమని రెండు లేఖలు వెళ్తాయి. ఆ లేఖలు ఆ దేశంలోని భారత హై కమీషనర్ కార్యాలయానికి వెళతాయి. 

మొదటి లేఖను ఐపీఎల్ నిర్వహించే కమిటీ ఆ సదరు ఆటగాడికి వీసా ఇవ్వవలిసిందిగా కోరుతూ లేఖను రాస్తే, మరో లేఖను ఫ్రాంచైజీలు రాస్తాయి. వారు ఆ లేఖలో ప్లేయర్లతో ఎన్ని రోజులపాటు ఒప్పందం కుదుర్చుకున్నామో నుంచి ఇంతకు కుదుర్చుకున్నామో వరకు అనేక అంశాలను ప్రస్తావిస్తారు. 

ఆ లేఖ ఆధారంగా వారికి ఇక్కడకు రావడానికి విదేశీ ఆటగాళ్లకు వర్క్ వీసాను జారీ చేస్తారు. కాబట్టి ఐపీఎల్ ఆడటానికి విదేశీ ఆటగాళ్లు భారత్ లో అడుగుపెట్టేది వర్క్ వీసా మీదనే! భారత ప్రభుత్వం వర్క్ విశాలపైనా కానీ, ఎంప్లాయిమెంట్ వీసాల మీద కానీ ఎటువంటి నిబంధనను విధించలేదు. 

కాబట్టి విదేశీ ఆటగాళ్లు నిరాటంకంగా భారత్ లో ఐపీఎల్ ఆడేందుకు వస్తారు. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. వారితోపాటుగా కోచింగ్ స్టాఫ్ కూడా ఇదే తరహా ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టు ఉంటుంది కాబట్టి వారు కూడా భారత్ లో ఐపీఎల్ కోసం విచ్చేస్తారు. 

కాకపోతే... ప్లేయర్ల తరుఫు బంధువులు, వారి కుటుంబాలు వారు మాత్రం రావడం కుదరదు. టూరిస్టు వీసాలను భారత ప్రభుత్వం జారీ చేయదు కాబట్టి, వారు రావడం మాత్రం అనుమానమే. కాకపోతే ఏప్రిల్ 15 తరువాత కరోనా తగ్గుముఖం పడితే... అప్పుడు వారు కూడా భారత్ కి వస్తారు. 

కాబట్టి ఐపీఎల్ కి సంబంధించి క్రికెట్ అభిమానులు ఎటువంటి బాధలు, అనుమానాలు పెట్టుకోవాలిసిన అవసరం లేదు. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడడం ఖచ్చితం అనేది సుస్పష్టం. కాబట్టి గెట్ రెడీ ఫర్ ఐపీఎల్ 2020!

click me!