ఎన్ఆర్ఐలను ఆదుకోండి.. తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ఫైర్

By Siva KodatiFirst Published May 5, 2020, 3:21 PM IST
Highlights

కరోనా కారణంగా వివిధ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కోరింది.

కరోనా కారణంగా వివిధ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కోరింది.

వివిధ దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి సంబంధించి కేంద్ర విమాన అనుమతులు ఇవ్వడంతో పాటు క్వారంటైన్‌పై సూచనలు ఇచ్చిందని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ గుర్తుచేశారు.

Also Read:తెలంగాణలోనూ వైన్ షాప్స్ ఓపెన్, రేపటి నుంచే: ప్రభుత్వం పచ్చజెండా

ఇందుకు సంబంధించి కేరళ, పంజాబ్, ఢిల్లీ, ఒరిస్సా మొదలగు కొన్ని రాష్ట్రాలు ... స్వదేశం వచ్చే వారి వివరాలను పోర్టల్ పెట్టి మరి సేకరిస్తోందని చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకు ఎన్ఆర్ఐల తరలింపు కోసం ఎలాంటి ప్రణాళిక విడుదల చేయలేదని వేణుగోపాల్ విమర్శించారు.

రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల నుంచి 1,50,000 మంది, లండన్ నుంచి 500 మంది, యూరప్ నుంచి 200 మంది భారత్‌కు రావడానికి ప్రయత్నించి ఎయిర్‌పోర్టులలో చిక్కుకుపోయారని వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:కరోనా రోగులకు డాక్టర్ ఫ్యామిలీ సేవలు: తల్లీదండ్రులతో కలిసి కొడుకు ట్రీట్‌మెంట్

రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఎన్ఆర్ఐల విషయాన్ని సరిగా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. గత 50 రోజులుగా యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్, న్యూజిలాండ్, బహ్రెయిన్, సౌదీ తదితర దేశాల్లో ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులకు, కార్మికులకు టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ చేయూతను అందించామని గంప వేణుగోపాల్ గుర్తుచేశారు. 

click me!