లాక్‌డౌన్: పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం

By Siva Kodati  |  First Published Apr 28, 2020, 6:46 PM IST

దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో పేదలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ముందుకొచ్చింది.


దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో పేదలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్‌రావుకు మంగళవారం ఫోరం ప్రతినిధులు లక్ష రూపాయల చెక్‌ను అందజేశారు.

కోవిడ్ 19పై పోరాటంలో హరీశ్ రావు నిరంతర శ్రమకి స్ఫూర్తితో వారికీ తోడ్పాటుగా తమ వంతు సాయం చేస్తున్నామని తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ అధ్యక్షులు ప్రమోద్‌ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ ,ఫౌండర్ వేణుగోపాల్ ,ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి ,రంగు వెంకట్ , మహేష్ జమ్మల సంయుక్త ప్రకటన లో తెలిపారు.

Latest Videos

undefined

 

 

దీనితో పాటు లండన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులకు ఆసరాగా నిలుస్తున్నట్లు వారు చెప్పారు. గత 39 రోజులుగా వివిధ తెలుగు, తెలంగాణ సేవా సంఘాల ఐక్యవేదిక ద్వారా తెలుగు విద్యార్ధులకు వసతి, భోజనం ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు.

ఈ విషయం తెలుసుకున్న భారత రాయబారి కార్యాలయం ఉన్నతాధికారులు డిప్యూటీ కమీషనర్ చరణ్ సింగ్, మంమీత్ నరాంగ్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుగు సంఘాలతో సమావేశమైనట్లు ఫోరమ్ ప్రతినిధులు తెలిపారు. 

click me!