తీవ్ర అనారోగ్యం.. దుబాయిలో ఇండియన్ డ్యాన్సర్ మృతి

Published : May 05, 2020, 08:51 AM IST
తీవ్ర అనారోగ్యం.. దుబాయిలో ఇండియన్ డ్యాన్సర్ మృతి

సారాంశం

కరోనా రోగులుండటంతో ఒక చిన్న క్లినిక్‌లో నొప్పి తగ్గేందుకు మాత్రలు తీసుకుని ఇంటికి వచ్చేశామని వివరించారు. నొప్పి తిరగబెట్టడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా

తీవ్ర అనారోగ్యంతో దుబాయిలో ఇండియన్ డ్యాన్సర్ ఒకరు మృతి చెందారు. కేరళకు చెందిన నృత్యకారిణి దీపా నాయర్‌(47) దుబాయ్‌లో స్థిరపడ్డారు. ఆమెకు తీవ్రంగా కడుపునొప్పి రావడంతో ఆదివారం ఆస్పత్రికి తరలించినట్లు భర్త సూరజ్‌ చెప్పారు. అక్కడ కరోనా రోగులుండటంతో ఒక చిన్న క్లినిక్‌లో నొప్పి తగ్గేందుకు మాత్రలు తీసుకుని ఇంటికి వచ్చేశామని వివరించారు. నొప్పి తిరగబెట్టడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో దీప కన్నుమూసినట్లు చెప్పారు. కరోనా సమస్య లేకపోతే తన భార్య బతికి ఉండేదని సూరజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..