భార్యాబిడ్డల హత్య... అమెరికాలో భారత సంతతి టెక్కీకి జీవిత ఖైదు

By telugu news team  |  First Published Nov 12, 2021, 9:44 AM IST

మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో శంకర్‌ నాగప్ప తన నేరాన్ని అంగీకరించడంతో తాజాగా అక్కడి న్యాయస్థానం అతడికి పెరోల్‌కు వీలులేని యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై అతడు ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.
 


భారత సంతతికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి.. అమెరికాలో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సదరు వ్యక్తి... తన కట్టుకున్న భార్య, కన్న బిడ్డలు ముగ్గిరిని అతి దారుణంగా హత్య  చేశాడు. ఈ కారణంగా.. అతనికి న్యాయస్థానం ఈ శిక్ష వేయడం గమనార్హం.

Also Read: పెద్ద శత్రువు పాక్ కాదు, చైనానే.. మనకు అమెరికా, రష్యా రెండూ కావాలి.. సీడీఎస్ బిపిన్ రావత్

Latest Videos

ఉద్యోగం పోవడంతో కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చలేకపోతున్నాననే నిరాశానిస్పృహలతో శంకర్‌ నాగప్ప హంగుడ్‌ అనే 55 ఏళ్ల వ్యక్తి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘోరానికి శిక్షగా ఇక అతడు చచ్చేదాకా కటకటాల వెనకే గడపనున్నాడు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో శంకర్‌ నాగప్ప తన నేరాన్ని అంగీకరించడంతో తాజాగా అక్కడి న్యాయస్థానం అతడికి పెరోల్‌కు వీలులేని యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై అతడు ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.

Also Read: దేశద్రోహ వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేయాలి.. ఆప్ పిటిషన్

రోజ్‌విల్లేలో శంకర్‌ నాగప్ప, తన భార్య జ్యోతి (46), పిల్లలు వరుణ్‌ (20), గౌరి (16), నిశ్చల్‌ (13)తో కలిసి ఉండేవాడు. 2019లో తన ఫ్లాట్‌లో వారం రోజుల వ్యవధిలో ఈ నలుగురినీ హత్య చేశాడు. ఆ ఏడాది అక్టోబరు 7న జ్యోతి, గౌరి, నిశ్చల్‌ను తన ఫ్లాట్‌లోనే హత్య చేశాడు. ఐదురోజుల తర్వాత వరుణ్‌ మృతదేహంతో కారులో వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాను నాలుగు హత్యలు చేసినట్లు పోలీసులకు చెప్పాడు. ఈ ఘటన తమను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని స్థానికులు చెప్పారు. 

click me!