
అమెరికాలో (america) భారత సంతతి (indian origin) సీఈవో (ceo) దారుణహత్యకు గురయ్యారు. క్యాసినో (casino) నుంచి ఇంటివరకు 80 కిలోమీటర్లు మేర బాధితుడిని వెంబడించిన దుండగుడు డబ్బు కోసం ఆయనను కాల్చిచంపాడు. గత మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. న్యూజెర్సీలోని (new jersey) ప్లెయిన్స్‌బోరోలో (plainsboro) నివాసం ఉంటున్న శ్రీరంగ అరవపల్లి (sree Ranga Aravapalli) (54) ... 2014 నుంచి ఆరెక్స్ లేబరేటరీస్ (arex laboratories) సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఫిలడెల్ఫియాలోని (philadelphia) క్యాసినోలో మంగళవారం తెల్లవారుజామున 10 వేల డాలర్లు గెలుచుకుని ఇంటికి బయలుదేరాడు. అక్కడ దీనిని గమనించిన రీడ్ జాన్ అనే దుండగుడు.. ఆ సొమ్ము కోసం అతన్ని కారులో రహస్యంగా వెంబడించాడు. న్యూజెర్సీలో ఇంటికి చేరుకున్నాక శ్రీరంగపై కాల్పులు జరిపి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అమెరికాలో వున్న భారతీయ సమాజం దిగ్భ్రాంతికి గురైంది.