భార్యమీద నిఘా పెట్టాలనుకుని సీసీ కెమెరాలు పెట్టి తనే బుక్కయ్యాడు.. ఎన్నారై భర్తకు షాక్..

By AN TeluguFirst Published Oct 16, 2021, 8:43 AM IST
Highlights

2014లో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. girl childకు జన్మనిచ్చిందని కోపంతో  అత్తమామలు ఆమెను నిత్యం వేధింపులకు గురి చేసేవారు.  భర్త కూడా తన తల్లిదండ్రులకు  వంతపాడేవాడు.
 

గుజరాత్ : భార్య పై నిఘా పెట్టేందుకు ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఓ ఎన్నారై భర్తకు ఊహించని షాక్ తగిలింది. అదే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాధితురాలు తన భర్త, అతడి తల్లిదండ్రులపై పోలీస్ కేసు పెట్టింది. గుజరాత్ లోని గాంధీ నగర్ లో ఈ ఘటన జరిగింది.  బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. 2011 నవంబర్లో ఆమె వివాహం జరిగింది.

ఆ తర్వాత మూడేళ్ల పాటు ఆమె సంసారం సాఫీగానే సాగిపోయింది. ఈ క్రమంలో 2014లో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అది కేవలం ఆమె తప్పే అయినట్టు భర్త, అత్తామామలు వ్యవహరించసాగారు. చదువుకుని అమెరికాలో ఉంటున్నా.. అతడి బుద్ది బురదలోనే ఉంది. అమ్మాయి పుట్టడానికి కారణం తెలియని మూర్ఖుడిగా వ్యవహరించాడు. girl childకు జన్మనిచ్చిందని కోపంతో  అత్తమామలు ఆమెను నిత్యం వేధింపులకు గురి చేసేవారు.  భర్త కూడా తన తల్లిదండ్రులకు  వంతపాడేవాడు.

2014లో అతడు ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లి పోయాడు.  తను కూడా వెంట తీసుకు వెళ్లాలని ఆమె పలుమార్లు కోరడంతో 2015లో అతడు భార్యను, తన తల్లిదండ్రులను తీసుకెళ్లాడు. వారంతా కలిసి Chicago రాష్ట్రంలో ఉండేవారు. అయితే america లోనూ ఆమె వేధింపులు అనుభవించింది.  అక్కడ కొత్త ఇల్లు కొనుక్కునేందుకు మరింత కట్నం తేవాలంటూ వారు ఆమెను dowry harassment చేసేవారు.

అయితే 2018 లో ఆమె అత్తమామలతో కలిసి ఇండియాకు తిరిగి వచ్చింది.  అదే ఏడాది భర్త కూడా భారత్ కు వచ్చేశాడు. ఈ క్రమంలో ముగ్గురు కలిసి ఆమెను చిత్రహింసలు  పెట్టేవారు.  ఆమెపై రోజంతా నిఘా పెట్టేందుకు ఇంట్లో పలుచోట్ల cc cameraలు బిగించారు.  ఆమెపై పలుమార్లు  చేయి చేసుకున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డయింది.

కరుడు కట్టిన రౌడీ షీటర్ దురై మురగన్ ఎన్ కౌంటర్

అయితే, 2019లో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయినా కూడా ఆమెకు ఇంట్లో వేధింపులు కొనసాగాయి.  కొంతకాలం క్రితం అమెరికాకు వెళ్ళిపోయాడు.  అయితే అత్తింటి వేధింపులు కొనసాగుతుండడంతో  బాధితురాలు గురువారం గాంధీనగర్ పోలీస్స్టేషన్లో complaint చేసింది. ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ నే సాక్ష్యంగా పేర్కొంది. దీంతో సీను ఒక్కసారిగా తారు మారై పోయింది.  

సీసీ కెమెరా ఫుటేజీతో భార్యను మరింత వేధిద్దామని భావించిన భర్త ప్లాన్ రివర్స్ అయ్యింది. అత్తామామల అరాచకం వెలుగులోకి వచ్చింది. ఎప్పటికీ కుక్కిన పేనులా ఉంటుందనుకున్న కోడలు ధైర్యం చేసింది. అసలు కోడలు తమ మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి అంత ధైర్యం చేస్తుందని పాపం ఆ అత్తామామలు, భర్త కూడా ఊహించలేకపోయారు. 

యేళ్ల తరబడి చిత్రహింసలు అనుభవించిన ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన పైనా,  అతడి తల్లిదండ్రులపై Domestic Violence Act కింద కేసు పెట్టారు.  ఆమె ఇప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

click me!