అన్నగారి ఆత్మ ఎంత క్షోభిస్తోందో

Published : Dec 23, 2016, 07:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
అన్నగారి ఆత్మ ఎంత క్షోభిస్తోందో

సారాంశం

ఎన్ టిఆర్ పేరుతో ఇద్దరు కుటుంబ సభ్యలు పెట్టిన పార్టీని ఎన్నికల సంఘం రద్దు చేసింది.

అన్న నందమూరి తారక రామారావు పైన జనాలుకున్న అభిమానం కూడా కుటుంబ సభ్యులకున్నట్లు కనబడటం లేదు. ఎన్టిఆర్ మృతిచెంది 20 ఏళ్ళయినా అభిమానులు ఇంకా మరచిపోలేదు. తెలుగునాట ‘అన్నగారు’ అంటే ఇప్పటికీ ఎన్ టిఆరే గుర్తుకువస్తారు. అటువంటిది అన్నగారి పేరుతో ప్రారంభించిన రెండు పార్టీల గుర్తింపు రద్దవటంతో అభిమానుల్లో అలజడి మొదలైంది.

 

ఇపుడిదంతా ఎందుకనుకుంటున్నారా? ఎన్ టిఆర్ పేరుతో ఇద్దరు కుటుంబ సభ్యలు పెట్టిన పార్టీని ఎన్నికల సంఘం రద్దు చేసింది. దేశవ్యాప్తంగా గుర్తింపు కోల్పోయిన 255 పార్టీల్లో ఈ రెండు కూడా ఉన్నాయి. ఎన్నికల సంఘం ఎందుకు రద్దు చేసిందంటే, పార్టీని పెట్టిన తర్వాత సంవత్సరాల తరబడి వారిద్దరూ పార్టీని గాలికి వదిలేసారు. దాంతో ఎన్నికల సంఘం రద్దు చేసింది.

 

అన్నగారు మృతిచెందిన తర్వాత పెద్ద కుమారుడు హరికృష్ణ ‘అన్న తెలుగుదేశం పార్టీ’ని స్ధాపించి హడావుడి చేసారు. కొంత కాలానికి మళ్ళీ టిడిపిలో చేరిపోయారు. అదేవిధంగా ఎన్ టిఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ‘ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని’ ఏర్పాటు చేసారు. షరా మామూలుగానే కొంత కాలం హడావుడి చేసి మళ్ళీ పట్టించుకోలేదు.

 

ఇటువంటి పార్టీల జాబితాను దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం వెలికి తీసింది. 2005-2015 మధ్య జరిగిన ఎన్నికల్లో పై రెండు పార్టీల తరపున ఒక్క అభ్యర్ధి కూడా పోటీ చేయకపోవటంతో చివరకు ఎన్నికల సంఘం రెండు పార్టీల గుర్తింపును రద్దు చేసింది.

 

పార్టీని ప్రారంభించిన తర్వాత మళ్లీ పై ఇద్దరూ పార్టీల గురించి పట్టించుకున్నట్లు లేదు. అసలు పార్టీ ప్రారంబించిన సంగతైనా గుర్తుందో లేదో వారికి. తన పేరుతో ప్రారంభించిన పార్టీలు రెండింటి గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయటంతో  పాపం అన్న గారి ఆత్మ ఎంతగా క్షోభిస్తోందో.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !