'జగన్ ను వైఎస్ హైదరాబాద్ లో కాలుపెట్టనీయలేదు'

First Published Aug 8, 2017, 6:55 PM IST
Highlights
  • జగన్ ను వైఎస్ హైదరాబాద్ కాలు పెట్టనీయలేదు
  • వైఎస్ కు ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి మంచిదోస్త్
  • ముఖ్యమంత్రి గా ఉన్నపుడు బాబు సెక్యూరిటీ వైఎస్ వసతి ఇవ్వలేదు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంచనాలత్మక విషయాలను మీడియాప్రతినిధులకు వెల్లడించారు. ఈ సాయంకాలం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠి  జరిపారు.  రాజశేఖర్ రెడ్డి పలు ఆరోపణలు కూడా చేశారు.

ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలు ఇవి: జగన్ తో సమస్యలొస్తాయని రాజశేఖర్ రెడ్డికి తెలుసని అంటూ - వైఎస్ ఉన్నంతకాలం జగన్ ను హైదరాబాద్ లో ఉండనివ్వలేదని గుర్తు చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డికి రాజశేఖర్ రెడ్డి మంచి స్నేహం ఉందని చెప్పారు. నక్స లైట్లకు సెల్ ఫోన్లు , డబ్బులు అందించిన గంగిరెడ్డికి వైఎస్ కు మంచి దోస్తానా ఉండటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘జగన్ రాష్ట్రంలోకి వస్తే తన  పదవి పోతుందని డైరెక్టుగా జగన్‌కే చెప్పారు. ఈ విషయాన్ని రోశయ్య ఏబీఎన్ ఓపెన్ హార్ట్ లో కూడా చెప్పారు. అయితే, జగన్‌ను అమెరికా పంపితే తిరుగు టపాలో వచ్చేశారు.’

 

అలిపిరి ఘటన(చంద్రబాబు మీద దాడి) జరిగినప్పుడు వైఎస్ నిరసనలో పాల్గొన్నవిషయం ప్రస్తావిస్తూ తన పేరు ఎక్కడ బయటకొస్తుందన్న భయంతోనే వైఎస్ నిరసనలో పాల్గొన్నాడని ముఖ్యమంత్రి ఆరోపించారు.

‘గండిరెడ్డిని ఏకసభ్య కమిషన్ పట్టుకుంటే వైఎస్ పదేపదే ఫోన్ చేశాడని కూడా చెప్పారు. వైఎస్ సీఎం అయ్యాక కూడా గంగిరెడ్డి ఇంటికి వెళ్లాలని చూశాడు స్మగ్లర్ ఇంటికి సీఎం వెళ్తే బాగుండదని వైఎస్ కు అందరూ సూచించారు.చివరకు గంగిరెడ్డి ఊరులో శుభకార్యం ఏర్పాటు చేసి అక్కడ  కలిశాడు,’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘కేంద్రం నాకు కల్పించిన భద్రతా సిబ్బందికి వైఎస్ ఏడాది పాటు ఎక్కడా వసతి కల్పించలేదు. కోపాలు, బాధలు నియంత్రించుకోవటంలోనే మన వ్యక్తిత్వం బయటపడుతుంది,’ అని అన్నారు.

 

‘అలిపిరిలో నాపై బాంబు దాడి జరిగినప్పుడు తన మనుషులు ఇరుక్కోకూడదని వైఎస్ నానా హడావిడి చేశాడు. మందుపాతర పేల్చిన నక్సల్స్ కు  సెల్‌ఫోన్లు ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు గంగిరెడ్డే.’

 

 

 

click me!