ఒక కుర్రాడు, ఎస్ ఐ ఇలా రోడ్డు మీదే తన్నుకున్నారు

Published : Apr 04, 2018, 12:06 PM ISTUpdated : Apr 04, 2018, 12:27 PM IST
ఒక కుర్రాడు, ఎస్ ఐ ఇలా రోడ్డు మీదే తన్నుకున్నారు

సారాంశం

ట్రాఫిక్ పోలీసు..బైక్ ని ఆపినందుకే

ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి.. వారి వద్ద ఛలానాలు కట్టించుకోవడం ట్రాఫిక్ పోలీసులకు పరిపాటే. వారి డ్యూటీ నిమిత్తం వాళ్లు ఆ పనిచేస్తుంటారు. అయితే.. తన డ్యూటీని సక్రమంగా నిర్వర్తించిన ఓ ట్రాఫిక్ పోలీసుపై యువకుడు వాగ్వాదానికి దిగాడు. ఆ వాగ్వాదం కాస్త.. నడిరోడ్డుపై ఇద్దరూ తన్నుకునేదాకా వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... చెన్నై మాంబళం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పోతీస్‌ వస్త్ర దుకాణం సమీపం ట్రాఫిక్‌ ఎస్‌ఐ సురేష్, స్పెషల్‌ ఎస్‌ఐ జయరామన్‌  సోమవారం సాయంత్రం ట్రాఫిక్‌ నియంత్రిస్తున్నారు. ఆ సమయంలో హెల్మెట్‌ లేకుండా బైక్‌పై ఇద్దరు మహిళలతో యువకుడు ప్రయాణించాడు. ఎస్‌ఐ సురేష్‌ యువకుడిని అడ్డుకుని ప్రశ్నించగా తన తల్లి, చెల్లెలితో అత్యవసర పనిపై వెళుతున్నట్లు తెలిపాడు. హెల్మెట్‌  ఎందుకు ధరించలేదని ప్రశ్నించగా యువకుడు వెటకా రంగా బదులిచ్చినట్లు సమాచారం.

దీంతో ఎస్‌ఐ బైక్‌ కీ తీసుకున్నాడు. ఎస్‌ఐ చేతిలోని బైక్‌ కీని యువకుడు లాక్కోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు బాహాబాహీ తలపడ్డారు.దీనిపై ఎస్‌ఐ సురేష్‌ మాంబళం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ  జరపగా అతడు చెన్నై సాలిగ్రామం జానకీరామన్‌ వీధికి చెందిన ప్రకాష్‌(21) కార్ల విక్రయ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు సంఘటనా స్థలంలో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. అధికారి విధి నిర్వహణను అడ్డుకోవడం సహా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu