తల్లి ప్రాణాల కోసం.. చిరుతతో యువతి పోరాటం

First Published Apr 4, 2018, 11:32 AM IST
Highlights
15నిమిషాలు చిరుతతో వీరోచితంగా పోరాడిన యువతి

చిరుతపులి మన పక్క నుంచి వెళుతోంది అంటేనే..అక్కడి నుంచి పరుగులు తీస్తాం. కనీసం అటువైపు అడుగు వేయడానికి కూడా సాహసించం. కానీ.. ఓ యువతి మాత్రం ఏకంగా చిరుతపులితో యుద్ధమే చేసింది. మీరు చదివింది నిజమే.. తల్లి ప్రాణాలు కాపడటం కోసం.. చిరుతతో దాదాపు 15 నిమిషాలు ప్రాణాలకు తెగించి పోరాడింది. చివరకు తన తల్లి ప్రాణాలను కాపాడగలిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సాకోలీ తాలుకా పరిధిలోని ఉస్‌గావ్‌లో బీజాబాయి, ఆమె కుమార్తె రూపాలీ(21) నివసిస్తున్నారు. వీరు మేకలను కాస్తూ జీవనం సాగిస్తున్నారు. మార్చి 24 రాత్రి 10 గంటల సమయంలో మేకలను కట్టేసిన ప్రాంగణం నుంచి శబ్ధం రావడంతో జీజాబాయి, ఆమె కుమార్తె రూపాలీ ఇంట్లో నుంచి బయటకి వచ్చారు. కాగా.. చిరుతపులి మేకలను ఆరగిస్తూ కనపడింది.

అక్కడికి వచ్చిన తల్లీకూతుర్లను చూసిన చిరుత వారిపై దాడికి తెగబడింది. భయపడకుండా రూపాలీ కర్రతో చిరుతపై ఎదురు దాడికి దిగింది. 15 నిమిషాల పాటు పోరాడింది.  ఓవైపు చిరుతపై దాడిచేస్తూ, మరోవైపు తన తల్లిని ఓ చెత్తో వెనక్కి నెడుతూ ఇంట్లోకి వెళ్లి గడివేసుకున్నారు. ఆ తర్వాత చిరుత వెళ్లిపోయింది.  చిరుత పోరాడే సమయంలో.. రూపాలీ తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన రూపాలీని నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్యవిద్యా కళాశాల ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొంది కోలుకున్న రూపాలీని మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు.

 

click me!