
బెంగళూరు: కాంగ్రెసు పార్టీపై చెన్నపట్నం బిజెపి అభ్యర్థి కాంగ్రెసుపై తీవ్రంగా మండిపడ్డారు. చెన్నపట్టణలో ఆయనపై జెడిఎస్ నేత కుమారస్వామి ఆధిక్యంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చెన్నపట్టణలో తాను ఓడిపోతున్నట్లు యోగీశ్వర చెప్పారు.
జెడిఎస్, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయ్యాయని, బ్లాక్ మనీ వెదజల్లీ తనను ఓడించేందుకు కుట్ర చేశాయని ఆయన ఆరోపించారు. కుమారస్వామి కాంగ్రెసు వల్లనే గెలుస్తున్నారని ఆయన అన్నారు.
కుమారస్వామి చెన్నపట్టణలోనే కాకుండా రామనగరలో కూడా ముందంజలో ఉన్నారు. కాంగ్రెసు, బిజెపి మధ్య ఫలితాల అంతరం పెరుగుతోంది. బిజెపి 98 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెసు 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జెడిఎస్ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
కర్ణాటక శాసనసభ ఫలితాల్లో బిజెపి క్రమంగా పుంజుకుంటోంది. బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించబోతున్నట్లు ఫలితాల ధోరణులు తెలియజేస్తున్నాయి.