ఈ ఆరు నియోజకవర్గాలే కీలకం...ఎందుకో తెలుసా..?

First Published May 15, 2018, 9:16 AM IST
Highlights

అందరి చూపు.. ఈ ఆరు నియోజకవర్గాలపైనే..

కర్ణాటకలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.  ఇక్కడ గెలిచినవారే.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పుతారనే భావన అటు రాజకీయ నేతల్లోనూ, ఇటు ప్రజల్లోనూ బలంగా నాటుకుపోయింది. దీంతో.. అందరి దృష్టి ఇప్పుడు ఈ ఎన్నికల మీదే ఉన్నాయి. కాగా.. ఈ ఓట్ల లెక్కింపులో ముఖ్యంగా అందరూ ఆరు నియోజకవర్గాల గురించే ప్రతిష్టాత్మకంగా చర్చించుకుంటున్నారు. ఆ నియోజకవర్గాలు ఏంటి..? వాటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం..

1.బాదామి..ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భాజపా నేత శ్రీరాములు ఇద్దరూ పోటీ చేస్తున్న ఈ స్థానం ఫలితంపై సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఒకరికి మించి మరొకరు ఇక్కడ గెలుపుపై మరొకరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2008లో భాజపా ,2013లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందారు.రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇద్దరు దిగ్గజాలు ఒకే స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో అక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

2. చాముండేశ్వరి...సిద్ధా రామయ్య తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టింది ఈ నియోజకవర్గం నుంచే. ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఎప్పుడు పోటీ చేసినా.. గెలుపు ఆయననే వరించింది. ఈ సారి మాత్రం లెక్కలు తేడా కొడుతున్నాయి. ఈ నియోజకవర్గం గతంతో  పోలిస్తే.. చాలా అభివృద్ధి సాధించింది. దీంతో.. ఈ సారి ఆ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారని అందరూ అనుకున్నారు. కానీ.. ఏమైందో ఏమో.. ఈ ఎన్నికల ఫలితాలు కాస్త తేడాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి విడుదలైన ఫలితాల ప్రకారం..సిద్ధారామయ్య వెనకంజలో ఉన్నారు. దీంతో.. సిద్ధారామయ్య ఈ నియోజకవర్గంపై ఆశలు వదులుకోవాల్సిందేనా అని అందరూ భావిస్తున్నారు.

3.శికరిపుర..భాజపా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో శికరిపుర ఒకటి. ఇక్కడ ఇప్పటి వరకూ 7 సార్లు భాజపా అభ్యర్థులను విజయం వరించింది. ఈ సారి ఈ స్థానం నుంచి భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి గోని మలాటేశ, జేడీఎస్ నుంచి హెచ్‌టీ బలేగర్‌ పోటీ చేస్తున్నారు. ఈ సారి కూడా బీజేపీనే గెలుస్తుందని అందరూ భావిస్తున్నారు.

4.కనకగిరి..కుల సమీకరణలు, వలసలు, ఎత్తుకు పైఎత్తుల రాజకీయాల్లో ముందున్న కొప్పళ జిల్లా కనకగిరి(ఎస్టీ) నియోజక వర్గం ఎన్నికల్లో ఎప్పట్లాగే రసవత్తరంగా ప్రచారం సాగింది. అయితే ఇది స్వతహాగా కాంగ్రెస్‌కు తిరుగులేని అసెంబ్లీ స్థానం. 2008,2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. ఈ అసెంబ్లీ స్థానం నుంచి శివరాజ్‌ తంగడగి(కాంగ్రెస్), బసవరాజ్‌(భాజపా), జేడీ(ఎస్‌) మంజులా పోటీ చేస్తున్నారు.

5.చెన్నపట్న..కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్‌) అధినేత దేవెగౌడ పెద్ద కుమారుడు కుమార స్వామి పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గం అభివృద్ధిలో కాస్త వెనకంజలో ఉంది. అయితే ఇచ్చిన హామీల్లో కొంతే మేరకు తీర్చిన దృష్ట్యా ఇక్కడ జేడీ(ఎస్‌)వై ప్రజలు మొగ్గే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ తరఫు నుంచి హెచ్‌.ఎం రేవణ్ణ, భాజపా నుంచి సీపీ యోగీశ్వర్‌ పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని మండలాల్లో కాంగ్రెస్‌కూ మంచి పేరుంది.

6.రామనగర: రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఒకటైన రామనగర అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పోటీ చేస్తున్నారు. భాజపా నుంచి లీలావతి, కాంగ్రెస్‌ నుంచి ఇక్బాల్‌ హుసేన్‌ హెచ్‌.ఏ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జేడీ(ఎస్‌) మినహా మిగతా రెండు పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
 

click me!