జగన్ మీద అభిమానంతో వీళ్లు ఏమి చేశారో తెలుసా..?

Published : Nov 07, 2017, 01:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
జగన్ మీద అభిమానంతో వీళ్లు ఏమి చేశారో తెలుసా..?

సారాంశం

రెండో రోజుకు చేరుకున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపాయలో మొదలై ఇచ్ఛాపురంలో ముగియనున్న జగన్ పాదయాత్ర జగన్ తోపాటు పాదయాత్రలో పాల్గొంటున్న అభిమానులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లు  చాలా మందే ఉన్నారు. అలా లబ్ధి పొందిన ఇద్దరు వ్యక్తులు ఆయన కుమారుడు జగన్ పై కూడా అభిమానాన్ని పెంచుకున్నారు. అయితే.. వారికిప్పుడు ఆ అభిమానాన్ని చాటుకునే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని వారి  అభిమానాన్ని చాటుకుంటున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. జగన్.. ప్రజాసంకల్ప యాత్ర సోమవారం మొదలైన సంగతి తెలిసిందే. ఆయన పాదయాత్ర ఇడుపుపాయలో మొదలై.. ఇచ్ఛాపురంలో ముగియనుంది. మొత్తం 3వేల కిలోమీటర్ల మేర సాగనున్న ఈ యాత్రలో ఇద్దరు జగన్ అభిమానులు ఆయనతోపాటు పాదయాత్ర చేయనున్నారు.

అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన నాగరాజు, కళ్యాణదుర్గం మండలం శెట్టూరుకు చెందిన సోమనాథరెడ్డి. వీరికి వైఎస్‌ పరిపాలనలో పక్కా ఇళ్లు దక్కాయి. రుణమాఫీ ద్వారా ప్రయోజనం పొందారు. దీంతో.. వైఎస్ కుటుంబం పై అభిమానం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తో పాటు ఈ ప్రజా సంకల్ప యాత్రలో అడుగు వేసేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే జగన్ మీద అభిమానంతో పలువురు ఎమ్మెల్యేలు పాదయాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !