నారాయణ, చైతన్య విద్యా సంస్థలపై ఫిర్యాదు

Published : Nov 01, 2017, 06:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
నారాయణ, చైతన్య విద్యా సంస్థలపై ఫిర్యాదు

సారాంశం

నారాయణ, చైతన్య విద్యా సంస్థలపై జాతీయ బాలల హక్కు కమిషన్ కి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లిన ఆయన జాతీయ బాలల హక్కు కమిషన్ ఛైర్మన్ స్తుతి కకర్ ని కలిసారు. చదువుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు

నారాయణ, చైతన్య విద్యా సంస్థలపై జాతీయ బాలల హక్కు కమిషన్ కి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లిన ఆయన జాతీయ బాలల హక్కు కమిషన్ ఛైర్మన్ స్తుతి కకర్ ని కలిసారు.

పై రెండు విద్యా సంస్థల్లో చదువుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు కేవలం ఈ రెండు విద్యా సంస్థల్లో సంవత్సర కాలంలో 96మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొనున్నారని తెలిపారు. అందులోనూ ఈ ఆత్మహత్యలన్నీ కేవలం ఏపీలోనే జరిగాయన్నారు. ఈ విషయంలో పై రెండు సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. విద్యా సంస్థల ఛైర్మన్ ఒకరు మంత్రి వర్గంలో ఉండటంతో ప్రభుత్వం కూడా  ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ మంత్రి గంటా.. నారాయణకు బంధువు కావడంతో  వీటిపై అసలు స్పందించడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఛైర్మన్ కి లేఖ అందజేశారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !